ETV Bharat / bharat

Rajya Sabha: సస్పెన్షన్​పై వెనక్కి తగ్గని వెంకయ్య- విపక్షాల వాకౌట్​ - rajya sabha live updates

Rajya Sabha: పార్లమెంట్​ ఉభయసభల్లో రెండోరోజు విపక్షాలు ఆందోళనలు కొనసాగించాయి. 12 మంది రాజ్యసభ సభ్యులపై సస్పెన్షన్​ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశాయి. అయితే తన నిర్ణయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఛైర్మన్ వెంకయ్య నాయుడు తేల్చి చెప్పారు. దీంతో సభ నుంచి విపక్షాలు వాకౌట్ చేశాయి(Rajya sabha).

Rajya Sabha
వెనక్కి తగ్గని వెంకయ్య- విపక్షాల వాకౌట్​
author img

By

Published : Nov 30, 2021, 11:55 AM IST

Updated : Nov 30, 2021, 2:42 PM IST

Rajya Sabha: 12 మంది రాజ్యసభ సభ్యులపై సస్పెన్షన్ విషయంలో తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు ఛైర్మన్ వెంకయ్యనాయుడు. సభ్యులు గత సమావేశాల్లో సభలో విధ్వంసం సృష్టించారని గుర్తు చేశారు. అలాంటి వారిని సస్పెండ్ చేయడం న్యాయమే అన్నారు.

parliament winter session: సభ్యుల సస్పెన్షన్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రాజ్యసభలో ప్రతిపక్షనేత మల్లికార్జున్ ఖర్గే వెంకయ్యను విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై మాట్లాడేందుకు ఆయన కార్యాలయానికి వెళ్లామన్నారు. గత సెషన్​లో జరిగిన దానికి ఇప్పుడు వేటు వేయడం తగదన్నారు. వెంకయ్య నాయుడు మాత్రం నిర్ణయాన్ని ఉపసంహరించుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. సభ ఛైర్మన్​గా సభ్యులను సస్పెండ్​ చేసే అధికారం తనకు ఉందన్నారు. దీంతో కాంగ్రెస్ సహా విపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.

సభ్యులపై సస్పెన్షన్​ను నిరసిస్తూ అంతకుముందు లోక్​సభలో కూడా విపక్షాలు ఆందోళనకు దిగాయి. వారికి మద్దతుగా సభ నుంచి వాకౌట్ చేశాయి. వీరి ఆందోళనల నడుమ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా.

ఉభయ సభల నుంచి వాకౌట్ చేసిన ప్రతిపక్ష నేతలు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. 12 మందిపై సస్పెన్షన్​ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు

కాలుజారి కింద పడ్డ ఎంపీ..

వాకౌట్ చేసే క్రమంలో పార్లమెంటు కారిడార్​ నుంచి బయటకు వస్తూ కాంగ్రెస్ లోక్​సభ ఎంపీ కే సురేశ్ కాలుజారి పడ్డారు. వెంటనే ఆయనకు ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం ఆస్పత్రికి తరలించారు.

పార్లమెంటు సమావేశాల బహిష్కరణ!

రెండో రోజు సమావేశాల ప్రారంభానికి ముందు పార్లమెంటు ఆవరణలో ప్రతిపక్షాలు సమావేశమయ్యాయి. 12మంది సభ్యుల సస్పెన్షన్​ అంశంపై చర్చించాయి. ఒకవేళ ఛైర్మన్​ ఈ సభ్యులపై సస్పెన్షన్​ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే మొత్తం సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయించాయి. ఈ భేటీలో కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు. టీఎంసీ మినహా 16 పార్టీలు సమావేశంలో పాల్గొన్నాయి. డీఎంకే, శివసేన, ఎన్​సీపీ, సీపీఎం, సీపీఐ, ఆప్​, ఆర్​జేడీ, ఐయూఎంఎల్​, ఎండీఎంకే, ఎల్​జేడీ, ఎన్​సీ, ఆర్ఎస్​పీ, టీఆర్​ఎస్​, కేరళ కాంగ్రెస్​, వీసీకే పార్టీలకు చెందిన సభ్యులు హాజరయ్యారు. సస్పెన్షన్​కు గురైన వారిలో తమ పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులు ఉన్నప్పటికీ టీఎంసీ విపక్షాల సమావేశానికి హాజరు కాలేదు. పార్లమెంటు శీతాకాల సమావేశాల తొలిరోజు కూడా విపక్షాలు నిర్వహించిన సమావేశానికి టీఎంసీ నేతలు దూరంగా ఉండటం గమనార్హం.

ఇదీ చదవండి: ఆటోవాలా కూతురుకు ఆరు గోల్డ్ మెడల్స్

Last Updated : Nov 30, 2021, 2:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.