ETV Bharat / bharat

'ఇండియా' కూటమి మూడో భేటీకి ముహుర్తం ఫిక్స్​​.. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో..

Opposition Meeting Mumbai : కేంద్రంలో బీజేపీను గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పడ్డ విపక్ష కూటమి 'ఇండియా' మూడో సమావేశానికి తేదీలు ఖరారయ్యాయి. ఆగస్టు 31, సెప్టెంబరు 1వ తేదీల్లో ముంబయి వేదికగా కూటమి పార్టీలు సమావేశం కానున్నాయి. ఈ మేరకు శివసేన (ఉద్ధవ్ వర్గం) నేత సంజయ్‌ రౌత్‌ వివరాలు వెల్లడించారు.

Opposition Meeting Mumbai
Opposition Meeting Mumbai
author img

By

Published : Aug 5, 2023, 3:42 PM IST

Updated : Aug 5, 2023, 4:43 PM IST

Opposition Meeting Mumbai : కేంద్రంలోని అధికార బీజేపీపై ఉమ్మడి పోరుకు చేతులు కలిపిన విపక్షాల కూటమి మూడో సమావేశానికి ముహుర్తం ఖారారైంది. ఆగస్టు 31, సెప్టెంబరు 1 తేదీల్లో ముంబయిలోని గ్రాండ్​ హయాత్​ హోటల్​లో ఈ సమావేశం జరగనున్నట్లు శివసేన (ఉద్ధవ్‌ వర్గం) నేత సంజయ్‌ రౌత్‌ తెలిపారు. ముంబయిలో జరిగిన మహా వికాస్ అఘాడీ మీటింగ్​ అనంతరం మాట్లాడిన రౌత్‌.. ఈ సమావేశానికి శివసేన ఉద్ధవ్‌ వర్గం నేతృత్వం వహిస్తోందని స్పష్టం చేశారు. తమతో కాంగ్రెస్, ఎన్​సీపీ పార్టీలు కూడా ఉంటాయని తెలిపారు. ఐదుగురు ముఖ్యమంత్రులతో సహా విపక్ష నేతలకు ఆగస్టు 31న ఏర్పాటు చేసే విందుకు ఉద్ధవ్‌ ఠాక్రే ఆతిథ్యం ఇస్తారని సంజయ్‌ రౌత్‌ తెలిపారు.

  • #WATCH | Shiv Sena (UBT) MP Sanjay Raut says, "After Patna and Bengaluru, I.N.D.I.A.'s meeting will be held in Mumbai on August 31-September 1. The meeting will be hosted by Uddhav Thackeray, by Shiv Sena. With us, Congress and NCP will also be there. In today's meeting, Sharad… pic.twitter.com/N499wqzlcO

    — ANI (@ANI) August 5, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ఈరోజు సమావేశమైన MVA నాయకులు పట్నా, బెంగుళూరులో జరిగిన విధంగా 'ఇండియా' సమావేశాన్ని విజయవంతం చేయాలని నిర్ణయించారు. రెండు రోజుల సమావేశానికి ఏర్పాట్లు చేయడానికి మేము ప్రతి నాయకుడికి బాధ్యతలు అప్పగించాం"
-- సంజయ్ రౌత్, శివసేన (ఉద్ధవ్ వర్గం) నేత

మహా వికాస్​ అఘాడీ ముఖ్య నేతలు శనివారం సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఎస్​సీపీ (శరద్) అధినేత శరత్ పవార్, ఆ పార్టీ రాష్ట యూనిట్ చీఫ్ జయంత్ పాటిల్, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే, శివసేన (ఉద్ధవ్) అధినేత ఉద్ధవ్ ఠాక్రే, సుభాశ్​ దేశాయ్, కాంగ్రెస్ నేతలు పృథ్విరాజ్ చవాన్, అశోక్ చవాన్, కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ చీఫ్ బాలాసాహెబ్ థోరట్, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు విజయ్ వాడెట్టివార్, కాంగ్రెస్ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు చీఫ్ నానా పటోలే హాజరయ్యారు.

  • #WATCH | Mumbai: Maharashtra Congress chief Nana Patole says, "The meeting (I.N.D.I.A) has been decided for 31st (August) and 1st (September)... We discussed how the meeting will be arranged. MVA (Maha Vikas Aghadi) is the host for the meeting." pic.twitter.com/rQlNT7vfr5

'కేంద్ర నియంతృత్వ ప్రభుత్వానికి 'ఇండియా' వ్యతిరేకం'
Opposition Meeting Nana Patole : పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీని దోషిగా తేల్చడంపై సుప్రీంకోర్టు స్టే విధించిందని.. ఈ నేపథ్యంలో ముంబయిలో జరగనున్న ఇండియా కూటమి సమావేశానికి చాలా ప్రాధాన్యం ఉందని కాంగ్రెస్​ నేత నానా పటోలే శనివారం అన్నారు. ముంబయి సమావేశం సన్నాహాలపై తాజా భేటీలో చర్చించినట్లు తెలిపారు. ఇండియా కూటమి.. కేంద్ర నియంతృత్వ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉందని.. రాహుల్ గాంధీ కేసులో సుప్రీం తీర్పు మొదటి విజయమని ఆయన అన్నారు.

ముంబయిలో విపక్ష కూటమి మూడో భేటీ.. ఆ అంశాలపైనే ప్రధాన చర్చ!

విపక్ష కూటమిలో 26 పార్టీలు.. ఎవరి బలం ఎంత?

Last Updated : Aug 5, 2023, 4:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.