Opposition Meeting In Mumbai : 2024 సార్వత్రిక ఎన్నికల్లో అధికార బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రతిపక్ష ఇండియా కూటమి మూడోసారి సమావేశం కానుంది. ఆగస్టు 31న మహారాష్ట్ర రాజధాని ముంబయిలో జరగనున్న ఈ సమావేశంపై అందరి దృష్టి ఉంది. 2024 సాధారణ ఎన్నికలే లక్ష్యంగా జరుగుతున్న ఈ సమావేశంలో.. కూటమి లోగో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. దాంతో పాటు సీట్ల పంపకాలు, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సృష్టత వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మరిన్ని పార్టీలు కూడా కూటమిలో చేరతాయని తెలుస్తోంది. ప్రస్తుతం 26 పార్టీలతో ఉన్న ఇండియా కూటమిలో.. ఈశాన్య రాష్టాలకు చెందిన కొన్ని ప్రాంతీయ పార్టీలు చేరొచ్చని సమాచారం. ముంబయిలోని గ్రాండ్ హయత్ హోటల్లో రెండు రోజుల పాటు ప్రతిపక్ష ఇండియా కూటమి సమావేశం జరగనుంది.
India Alliance Meeting Mumbai : 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీకి వ్యతిరేకంగా వీలైనన్నీ పార్టీలను ఐక్యం చేయడమే కోసం ప్రయత్నిస్తున్నట్లు జేడీయూ అధినేత నితీశ్ కుమార్ తెలిపారు. ఆ దిశగా తాను పనిచేస్తున్నట్లు వెల్లడించారు. తనకు వ్యక్తిగతంగా ఎలాంటి కోరిక లేదని ఆయన పేర్కొన్నారు. "ఈ సమావేశంలోనే ఇండియా కూటమి లోగో విడుదల చేస్తాం. దానిపైనే చర్చలు జరుగుతున్నాయి. ఆ లోగో 140 కోట్ల భారత ప్రజలకు చేరువయ్యేలా రూపొందిస్తాం. దేశాన్ని ఐక్యంగా ఉంచే శక్తిని కూడా ఈ లోగో ప్రతిబిస్తుంది." అని శివసేన ఉద్ధవ్ నేత సంజయ్ రౌత్ తెలిపారు. సీట్ల పంపకాలు, సమన్వయ కమిటీ ఏర్పాటు, కూటమి కన్వీనర్ నియామకంపై తదుపరి సమావేశంలో చర్చలు జరుగుతాయని కాంగ్రెస్ నాయకుడు మిలింద్ దేవరా వివరించారు.
శివసేన(యూబీటీ), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్‌లతో కూడిన మహా వికాస్ అఘాడి అధ్వర్యంలో ఇండియా కూటమి మూడో సమావేశం జరగనుంది. ఇండియా కూటమి నాయలకులతో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఎంపీలు సోనియా, రాహుల్ గాంధీ ఈ సమావేశంలో పాల్లొంటారు. ఇండియా కూటమి మొదటి సమావేశం బిహార్ రాజధాని పట్నాలో జరగ్గా.. రెండో సమావేశం కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఓడించడమే లక్ష్యంగా ప్రతిపక్షాలన్నీ ఏకం అయ్యాయి. అందులో భాగంగానే విడతల వారిగి వివిధ రాష్ట్రాలో సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నాయి.