ETV Bharat / bharat

'విపక్షాలకు ఆ ధైర్యం లేదు- ఓటు బ్యాంకు పోతుందనే భయం' - UP polls 2022 news

UP Election 2022: యూపీలో జరిగిన తొలి నాలుగు దశ ఎన్నికల్లో ఓటర్లు భాజపా వైపే ఉన్నారని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఓట్ల విభజనలో విపక్షాల లెక్క తప్పిందన్నారు. ఈ క్రమంలోనే కుటుంబ పార్టీలపై విమర్శలు గుప్పించారు.

UP Election 2022
UP Election 2022
author img

By

Published : Feb 24, 2022, 4:29 PM IST

UP Election 2022: తమ ఓటు బ్యాంకు పోతుందనే భయంతో అహ్మదాబాద్​ పేలుళ్లపై కోర్టు తీర్పును స్వాగతించే ధైర్యం కొన్ని ప్రతిపక్ష పార్టీలు చేయడం లేదని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. యూపీలోని అమేఠీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ.. వారసత్వ పార్టీలు లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. భాజపాకు కుటుంబం ముఖ్యం కాదన్నారు.

2008 ఏడాది అహ్మదాబాద్‌లో జరిగిన వరుస పేలుళ్ల కేసులో ప్రత్యేక కోర్టు 38 మందికి మరణ శిక్ష విధించిందగా.. మరో 11 మందికి జీవిత ఖైదు విధించిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ తీర్పును స్వాగతించే ధైర్యం చేయలేకపోతున్నాయని అన్నారు.

మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో తొలినాలుగు దశల్లో ఓటర్లు తమ పార్టీకి అండగా నిలిచారని మోదీ పేర్కొన్నారు. ఓట్ల విభజన విషయంలో విపక్షాల లెక్క తప్పిందన్నారు.

ఈ సందర్భంగా.. తనకు ఫిబ్రవరి 24 ఎంతో ప్రత్యేకమైందని చెప్పారు. "మూడేళ్ల క్రితం ఇదే రోజు పీఎం కిసాన్​ యోజనను ప్రారంభించాం. 20 క్రితం తాను తొలిసారి ఎమ్మెల్యే అయిన రోజు కూడా ఇదే" అని మోదీ తెలిపారు.

ఇప్పటికే నాలుగు దశలకు పోలింగ్ పూర్తవగా.. మరో మూడు విడతలకు ఎన్నికల జరగనున్నాయి. ఫలితాలు మార్చి 10న వెలువడనున్నాయి.

ఇదీ చూడండి: 'భారత్ నుంచి సంపూర్ణ మద్దతు కోరుతున్నాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.