ETV Bharat / bharat

'ఆపరేషన్ దేవీ శక్తి' సక్సెస్​.. అఫ్గాన్​ నుంచి భారత్​కు 104మంది - భారత్ అఫ్గాన్ సంబంధాలు

Operation Devi Shakti: అఫ్గాన్​లో చిక్కుకున్న 104మందిని ప్రత్యేక విమానంలో భారత్​కు తీసుకొచ్చింది కేంద్రం. వీరిలో 10మంది భారతీయులు ఉన్నారు. 'ఆపరేషన్ దేవీ శక్తి'లో భాగంగా ఈ ఏర్పాట్లు చేశామని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రయాణికులతో పాటు.. అఫ్గాన్​లోని చారిత్రక గురుద్వారాల హిందూ మత గ్రంథాలను సైతం తరలించారు.

special flight Afghanistan
అఫ్గాన్​ నుంచి ప్రత్యేక విమానం
author img

By

Published : Dec 10, 2021, 7:51 PM IST

Operation Devi Shakti Latest News: సంక్షోభంలో చిక్కుకున్న అఫ్గానిస్థాన్‌ నుంచి భారతీయులతో పాటు.. అఫ్గాన్​ పౌరులను సురక్షితంగా తీసుకొచ్చింది కేంద్రం. ప్రత్యేక విమానంలో 104 మంది శుక్రవారం భారత్​లో అడుగుపెట్టారు.

Indian Nationals in Afghanistan: వీరిలో కాబుల్ నుంచి 10 మంది, ఇతర ప్రాంతాల నుంచి మిగతా వారు వచ్చినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. ఆగస్టు 15న అఫ్గాన్​ను తాలిబన్‌లు చేజిక్కించుకున్న అనంతరం భారతీయులను తరలించేందుకు 'ఆపరేషన్ దేవీ శక్తి'ని కేంద్రం ప్రారంభించిందని గుర్తుచేశారు.

special flight Afghanistan
అఫ్గాన్​ నుంచి వచ్చిన ప్రత్యేక విమానం

"ఈ విమానంలో అఫ్గానిస్థాన్​లోని హిందూ-సిక్కు మైనారిటీకి చెందిన 10 మంది భారతీయులు సహా.. 94 మంది అఫ్గాన్‌ పౌరులను సురక్షితంగా తీసుకొచ్చాం. వీరిలో 9 మంది చిన్నపిల్లలు, ముగ్గురు శిశువులు ఉన్నారు."

--భారత విదేశాంగ శాఖ

Asamai Temple Afghanistan: ప్రయాణికులతో పాటు.. గురు గ్రంథ్ సాహిబ్ రచనలు, మూడు కాపీల హిందూ మత గ్రంథాలను కూడా తీసుకొచ్చింది కేంద్రం.

special flight Afghanistan
విమానాశ్రయంలో దిగిన పౌరులు

India Afghanistan Flight: ఈ విమానం అఫ్గాన్​కు తిరిగి వెళ్లే సమయంలో వైద్య సామాగ్రితో పాటు భారత్​లో చిక్కుకుపోయిన 90 మంది అఫ్గాన్ పౌరులను తరలించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.