ETV Bharat / bharat

పాక్​ టీనేజర్​తో భారతీయురాలి 'లూడో లవ్'​- బోర్డర్ క్రాస్​ చేసేలోగా... - వాఘా సరిహద్దు

Online Ludo Love: లూడో గేమ్​లో ఏర్పడిన పరిచయంతో సరిహద్దు దాటేందుకు సిద్ధమైంది ఓ మహిళ. ప్రియుడి సూచనలపై సరిహద్దు ప్రాంతాలకు కూడా చేరుకుంది. కానీ పోలీసులకు ఆటో డ్రైవర్​ సమాచారం ఇచ్చేసరికి ఆమె ప్లాన్​ ఫెయిలైంది. మహిళను పోలీసులు అరెస్ట్​ చేశారు. ఇంతకీ ఈ లూడో ప్రేమకథ ఎక్కడిది అంటే..

rajasthan
ఆన్​లైన్​ లూడోలో లవ్​- సరిహద్దు దాటేందుకు రెడీ.. కానీ
author img

By

Published : Jan 6, 2022, 5:26 PM IST

Online Ludo Love: ఆన్​లైన్​ గేమ్​ ద్వారా పరిచయమైన వ్యక్తి కోసం భర్త, బిడ్డలను వదిలేసి దేశ సరిహద్దు దాటేందుకు సిద్ధమైంది ఓ మహిళ. ఇందుకు కోసం సరిహద్దు వరకు చేరుకుంది. కానీ అప్పటికే ఈ విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన పంజాబ్​లో గురువారం వెలుగు చూసింది.

Online Ludo Love
సరిహద్దు దాటేందుకు ప్రయత్నించిన రాజస్థాన్​ మహిళ

గేమ్​తో పరిచయం..

రాజస్థాన్​కు చెందిన ఆ మహిళ తరచూ ఆన్​లైన్​లో లూడో ఆడుతుండేది. ఈ క్రమంలో పాకిస్థాన్​కు చెందిన ఓ టీనేజర్​తో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. ఇకపై ఆ యువకుడితోనే కలిసి జీవించాలని ఆ మహిళ నిశ్చయించుకుంది. పాక్​ యువకుడి సూచనల మేరకు భర్తను బిడ్డను వదిలేసి పంజాబ్​ చేరుకుంది. వాఘా సరిహద్దు ద్వారా పాకిస్థాన్​లోకి ప్రవేశించాలని ఆ మహిళ భావించింది.

ఆటో డ్రైవర్​ అనుమానంతో..

అమృత్​సర్​కు వచ్చిన మహిళను వాఘా బార్డర్​ చేరుకోమని ప్రియుడు సూచించాడు. దీంతో మహిళ ఆటోను బుక్​ చేసుకుంది. మహిళను వాఘా బార్డర్​ చేర్చమని పాక్​ యువకుడు ఫోన్​ ద్వారా డ్రైవర్​కు సూచనలు ఇచ్చాడు. దీనిపై అనుమానం వ్యక్తం చేసిన డ్రైవర్​ పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మహిళను అదుపులోకి తీసుకున్నారు.

Online Ludo Love
పోలీసులతో రాజస్థానీ మహిళ

గత 10-12 రోజులుగా తరచూ యువకుడితో మాట్లాడుతున్నట్లు మహిళ పేర్కొంది. సరిహద్దు దాటి వస్తే తనను కలుసుకుంటానని అతను చెప్పినట్లు తెలిపింది. కానీ వాఘా వద్దకు తీసుకెళ్లేందుకు ఆటో డ్రైవర్​ సహకరించలేదని చెప్పుకొచ్చింది.

మహిళ వద్ద కొంత డబ్బు, నగలు కూడా ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. ఆమె గురించి కుటుంబసభ్యులకు సమాచారం అందించామని పేర్కొన్నారు.

ఇదీ చూడండి : 'వర్చువల్​ ర్యాలీలు, ఆన్​లైన్​ ఓటింగ్​ సాధ్యమేనా?'.. ఈసీకి హైకోర్టు ప్రశ్న

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.