ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ ఇంటి (యాంటిల్లా) సమీపంలో లభించిన పేలుడు పదార్థాల కేసులో పోలీసులకు పురోగతి లభించింది. జిలెటిన్ స్టిక్స్తో ఉన్న స్కార్పియో కారును పార్క్ చేసిన నిందితుడి వివరాలు లభించినట్టు సమాచారం. సీసీటీవీ దృశ్యాలలో నిందితుడు నిలిపివేసిన కారు పక్క నుంచి ఓ తెల్లని ఇన్నోవా కారు వెళ్లడం పోలీసులు గుర్తించారు. ఆ వాహనంలోని వారు చెప్పిన వివరాల ఆధారంగా నిందితుడి గురించి తెలుసుకున్నట్లు పోలీసులు తెలిపారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
బుధవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు అంబానీ ఇంటి సమీపంలో పేలుడు పదార్థాలు ఉన్న కారును నిలిపారు. అనుమానాస్పదంగా ఉన్న ఈ కారును పోలీసులు గురువారం గుర్తించి తనిఖీ చేయగా జిలెటిన్ స్టిక్స్ సహా అంబానీను హెచ్చరిస్తూ ఉన్న లేఖ లభ్యమయ్యాయి .
ఇదీ చదవండి : అంబానీ ఇంటి వద్ద 'బాంబుల కారు' కేసులో ట్విస్ట్!