One Nation One Election Panel: ఒకే దేశం, ఒకే ఎన్నికల సాధ్యాసాధ్యాలపై ఏర్పాటైన మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ ప్రజల నుంచి సూచనలు కోరింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రజల నుంచి జనవరి 15 లోపు వచ్చే సూచనలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది. సూచనలు పంపాలనుకున్న వారు ప్యానెల్ వెబ్సైట్ onoe.gov.inలో పోస్ట్ చేయాలని లేదంటే sc-hlc@gov.inకు మెయిల్ చేయాలని తెలిపింది. గతేడాది సెప్టెంబర్‌లో ఏర్పాటైన కోవింద్ కమిటీ ఇప్పటి వరకూ రెండు సార్లు సమావేశమైంది.
దేశంలోని 6 జాతీయ, 33 రాష్ట్ర పార్టీలతోపాటు 7 గుర్తింపు పొందని పార్టీల నుంచి ఇప్పటికే జమిలీ ఎన్నికలపై అభిప్రాయాలు కోరింది. ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనపై ఒకరోజు పరస్పర చర్చను కోరుతూ ఇటీవల రాజకీయ పార్టీలకు లేఖ కూడా రాసింది. జమిలీ ఎన్నికలపై లా కమిషన్ అభిప్రాయాలను కూడా కమిటీ ఇప్పటికే తీసుకుంది.
-
'One Nation, One Election' high-level committee, headed by former President Ram Nath Kovind, invites public suggestions "for making appropriate changes in the existing legal administrative framework to enable simultaneous elections in the country." The suggestions can be posted…
— ANI (@ANI) January 6, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">'One Nation, One Election' high-level committee, headed by former President Ram Nath Kovind, invites public suggestions "for making appropriate changes in the existing legal administrative framework to enable simultaneous elections in the country." The suggestions can be posted…
— ANI (@ANI) January 6, 2024'One Nation, One Election' high-level committee, headed by former President Ram Nath Kovind, invites public suggestions "for making appropriate changes in the existing legal administrative framework to enable simultaneous elections in the country." The suggestions can be posted…
— ANI (@ANI) January 6, 2024
భారత రాజ్యాంగం ఇతర చట్టబద్ధమైన నిబంధనల ప్రకారం ప్రస్తుతం ఉన్న ఫ్రేమ్‌వర్క్‌ను కోవింద్ కమిటీ దృష్టిలో పెట్టుకోనుంది. లోక్‌సభ రాష్ట్ర శాసనసభలు, మున్సిపాలిటీలు, పంచాయతీలకు ఏకాకాలంలో ఎన్నికలు నిర్వహించడం కోసం సిఫార్సులు చేయడానికి కోవింద్ కమిటీ ఏర్పాటైంది. గత సమావేశాల్లోనే కీలక నిర్ణయాలు తీసుకుంది ఈ కమిటీ. గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల అభిప్రాయలను స్వీకరిస్తామని చెప్పిన ఈ కమిటీ, తాజాగా సూచనలను ఆహ్వానించింది.
One Nation One Election Committee Members: జమిలీ ఎన్నికల సాధ్యాసాధ్యాలను పరిశీలించే కమిటీలో అధికార, ప్రతిపక్ష నేతలతో పాటు శాసన, న్యాయ, ఆర్థిక నిపుణులకు కేంద్రం స్థానం కల్పించింది. కమిటీలో రామ్‌నాథ్ కోవింద్‌తో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి, రాజ్యసభ మాజీ ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్, 15వ ఆర్థిక సంఘం మాజీ ఛైర్మన్ ఎన్కే సింగ్, సీనియర్ అడ్వొకేట్ హరీశ్ సాల్వే, లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ డాక్టర్ సుభాశ్ సీ కశ్యప్, మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారి ఉన్నారు.
One Nation One Election Committee : జమిలి ఎన్నికలపై కసరత్తు ముమ్మరం.. రామ్‌నాథ్ ఇంట్లో కీలక భేటీఠారి ఉన్నారు.
One Nation One Election : జమిలి ఎన్నికలపై కసరత్తు షురూ.. ప్రజలకు ఒరిగేదేంటని విపక్షాల ప్రశ్న