ETV Bharat / bharat

ఆ జూపార్కులో కరోనాకు మరో మృగరాజు బలి - వాండలూర్ జూపార్క్​

తమిళనాడులోని వాండలూర్​ జూపార్క్​లో కరోనాతో మరో సింహం చనిపోయింది. రెండు వారాల వ్యవధిలోనే రెండు సింహాలు మరణించాయని జూ అధికారులు తెలిపారు.

lion dead with corona
కరోనాతో సింహిం మృతి
author img

By

Published : Jun 16, 2021, 8:23 PM IST

చెన్నైలోని వాండలూర్‌ అన్నా జూపార్కులో కరోనాతో మరో సింహం మృతి చెందింది. 12ఏళ్ల ఆసియా మగ సింహం.. బుధవారం మరణించినట్లు జూ అధికారులు తెలిపారు. కరోనా పాజిటివ్​గా తేలిన తర్వాత అత్యవసర విభాగంలో ఉంచి.. ఆ మృగరాజుకు చికిత్స అందించినట్లు పేర్కొన్నారు.

కరోనా లక్షణాలు కనిపించగా.. జూలోని పశువైద్య బృందం పరీక్షలు నిర్వహించారు. ఆ నమూనాలను మధ్యప్రదేశ్​ భూపాల్​లోని ఎన్​ఐహెచ్​ఎస్​ఏడీకి పంపినట్లు అధికారులు తెలిపారు.

మొత్తం 14 సింహాల్లో ఏడు కరోనా బారిన పడ్డాయి. అందులో జూన్​ 3న వైరస్​తో ఒకటి చనిపోగా.. తాజాగా ఈ సింహం మరణించిందని అధికారులు వెల్లడించారు.

ఇదీ చూడండి: జూపార్కులో కరోనాతో ఆడ సింహం మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.