అసోం కార్బీ ఆంగ్లోంగ్ జిల్లాలో జరిగిన సంప్రదాయ వేడుకలో కలుషిత ఆహారం(Food Poison) తిని.. ఎనిమిదేళ్ల బాలిక మరణించింది. మరో 50 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన అర్లంగ్‌పిరా గ్రామంలో శుక్రవారం జరిగింది.
ఈ సంప్రదాయ వేడుకలో ఆహారం తిన్న కొన్ని క్షణాల్లోనే.. కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలు వంటి లక్షణాలతో(food poison symptoms) అవస్థలు పడ్డారు. బాధితులను తర్వాత వారిని బోకజన్ సివిల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడే ఓ బాలిక మరణించిందని అధికారులు తెలిపారు. మిగిలినవారు చికిత్స పొందుతున్నారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక అధికారులు.. ఆ గ్రామాన్ని చేరుకుని పరిస్థితిపై ఆరా తీసినట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: ఉగ్ర ఏరివేత: 8 ఎన్ కౌంటర్లు.. 11మంది ముష్కరులు హతం