కరోనా టీకా అందుబాటులోకి రాగానే తొలుత ఆరోగ్య కార్యకర్తలకే ప్రభుత్వం ప్రాధాన్యమివ్వనుంది. అన్ని రాష్ట్రాల్లోని 92 శాతం ప్రభుత్వ, 55 శాతం ప్రైవేటు ఆసుపత్రులకు సంబంధించి రాష్ట్రాలు అందించిన డేటా ప్రకారం.. సుమారు కోటి మంది సిబ్బందికి తొలి టీకా అందించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
ఇప్పటికే వైద్యులు, వైద్య విద్యార్థులు, నర్సులు, ఆశా కార్యకర్తలతో సహా ఫ్రంట్‌లైన్ హెల్త్‌కేర్ కార్మికులను గుర్తించే ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్రాలను కోరింది కేంద్రం. తొలిదశ దశలో వ్యాక్సినేషన్లో టీకా పంపణీ, లబ్ధిదారుల ధ్రువీకరణ వంటి కీలక అంశాలకు సంబంధించి మానవ వనరుల ఏర్పాటు, ప్రణాళిక సిద్ధం చేయాలని స్పష్టం చేసింది. ఈ కసరత్తు మరో వారంలో పూర్తి కానుంది.
టీకా పంపిణీ వ్యూహాలపై చర్చించడానికి అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో మంగళవారం ప్రధాని మోదీ భేటీ అయ్యారు.
ఇదీ చూడండి: కరోనాపై సమీక్ష: సీఎంలతో ప్రధాని మోదీ భేటీ