కర్ణాటక కొడగులోని మడికేరిలో అరుదైన ఆపరేషన్ చేశారు వైద్యులు. మహిళ కడపులో నుంచి కిలోన్నర వెంట్రుకలను బయటకు తీశారు. కొడగు వైద్య కళాశాలలో డాక్టర్ అజిత్ కుమార్ నేతృత్వంలోని బృందం గంటలపాటు శ్రమించి ఈ సర్జరీని విజయవంతంగా పూర్తి చేసింది.
కొద్ది రోజుల క్రితం ఓ మహిళ కడపునొప్పితో ఈ ఆస్పత్రిలో చేరింది. స్కానింగ్ చేసిన వైద్యులు ఆమె కడుపులో గడ్డ ఉన్నట్లు గుర్తించారు. వెంట్రుకల్లాంటి పదార్థంతో అది ఏర్పడినట్లు గమనించారు. ఆ మహిళ వెంట్రుకలు తినే అరుదైన మానసిక వ్యాధి 'ట్రికపేజియాతో' బాధపడుతున్నట్లు తెలుసుకున్నారు. అనంతరం ఆమెకు ఆపరేషన్ చేశారు. కడపులో వెంట్రకలతో ఏర్పడిన కేజీన్నర గడ్డను తొలగించారు. ప్రస్తుతం మహిళ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు చెప్పారు.
ట్రికపేజియా అనేది మానసిక రోగం. ఈ వ్యాధి ఉన్నవారు తరచూ తమ వెంట్రుకలను తింటూ ఉంటారు. ఒక్కోసారి ఊడిన జుట్టును మొత్తం ఒకేసారి తినేస్తుంటారు.
ఇదీ చదవండి: ముఖంపై 8 కేజీల కణతి.. 16 సర్జరీలు చేసి చివరకు...