గుజరాత్ సబర్కంతా జిల్లా భజ్పురా గ్రామంలో పటిష్ఠ భద్రత మధ్య దళితుల వివాహాన్ని జరిపారు పోలీసులు. నిమ్నకులాలకు చెందిన వరుడు.. గుర్రంపై ఊరేగింపుగా పెళ్లి మండపానికి రావటాన్ని స్థానికంగా ఉన్న అగ్రకులాలు అడ్డుకున్న ఘటనలు ఇటీవలి కాలంలో ఆ ప్రాంతంలో భారీగా వెలుగుచూశాయి.
ఈ నేపథ్యంలో తమకు భద్రత కావాలని వరుడి తల్లిదండ్రులు కోరడం వల్ల వివాహం జరిగే ప్రాంతంలో ఓ డీఎస్పీ, ఏడుగురు ఎస్సైలు, 60 మంది కానిస్టేబుళ్లను మోహరించామని వివరించారు డీఎస్పీ చౌహాన్. పోలీసుల సహకారంతో నరేష్ వంకర్ కుమారుడు దుర్లబ్ వివాహం శాంతియుతంగా జరిగిందన్నారు. ఈ సందర్భంగా తన వివాహానికి సహకరించిన పోలీసులకు కృతజ్ఞతలు తెలిపాడు దుర్లబ్.
![On kin's request, cops protect Dalit's wedding procession in Gujarat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/vlcsnap-2021-03-06-20h17m45s709_0603newsroom_1615042342_687.png)
![On kin's request, cops protect Dalit's wedding procession in Gujarat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/vlcsnap-2021-03-06-20h17m51s975_0603newsroom_1615042342_565.png)
![On kin's request, cops protect Dalit's wedding procession in Gujarat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/vlcsnap-2021-03-06-20h18m06s326_0603newsroom_1615042342_54.png)
![On kin's request, cops protect Dalit's wedding procession in Gujarat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/vlcsnap-2021-03-06-20h19m41s261_0603newsroom_1615042342_52.png)
ఇదీ చదవండి : ఆ నాలుగు రాష్ట్రాల్లో మొక్కుబడిగా మహిళల 'వాటా'