ETV Bharat / bharat

దక్షిణ కొరియా పర్యటనలో నరవాణే - Agency for Defense Development

దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న భారత సైన్యాధ్యక్షుడు ఎం ఎం నరవాణే.. ఆ దేశ రక్షణ అభివృద్ధి సంస్థను సందర్శించారు. ప్రస్తుతం ఆయన మూడు రోజుల పర్యటలో ఉన్నారు.

On 3-day visit to S Korea, Army chief Naravane visits Agency for Defense Development at Daejeon
దక్షిణ కొరియా సైన్యాధికారులతో నరవాణే భేటీ!
author img

By

Published : Dec 29, 2020, 11:54 PM IST

మూడు రోజుల దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా.. డీజియోన్​ ప్రాంతంలోని రక్షణ అభివృద్ధి సంస్థను(ఏడీడీ) సందర్శించారు భారత సైన్యాధ్యక్షుడు ఎం ఎం నరవాణే.

"నరవాణే.. దక్షిణ కొరియా డీజియోన్​లోని ఏడీడీని సందర్శించారు. ఏడీడీ ఆ దేశంలో రక్షణ సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధన అభివృద్ధికి బాధ్యత వహిస్తోంది. ఆయన పర్యటన ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక రక్షణ సహకారాలను బలోపేతం చేస్తుందని భావిస్తున్నాం," అని భారత సైన్యం ట్వీట్​ చేసింది.

డిసెంబరు 28 నుంచి 30 వరకు దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న సైన్యాధ్యక్షుడు.. ఆ దేశ ఉన్నత స్థాయి అధికారులతో భేటీ కానున్నారు. ఈ క్రమంలో రక్షణ సహకారాలు బలోపేతం చేసే దిశగా కీలక చర్చలు జరగనున్నాయి.

ఈ నెల రెండో వారంలో ఆరు రోజుల పాటు యూఏఈ, సౌదీ అరేబియాల్లో పర్యటించారు నరవాణే.

ఇదీ చూడండి: యూఏఈ, సౌదీ పర్యటనకు నరవాణే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.