Omicron sub variant India: ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్న సమయంలో.. ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. గుజరాత్లో మూడు సబ్ వేరియంట్లు వెలుగులోకి వచ్చాయి. ఇందుకు సంబంధించి ఒక్కరోజే 41 కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. బీఏ1, బీఏ2, బీఏ3 వేరియంట్ కేసులను గుర్తించినట్లు వెల్లడించారు. వీటి వల్ల ఇప్పటికే బ్రిటన్‌లో వైరస్ ఉద్ధృతంగా వ్యాపిస్తోంది.
Omicron sub variant cases
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోనూ ఒమిక్రాన్ బీఏ2 వేరియంట్ కేసులు వెలుగులోకి వచ్చాయి. 16 మందిలో ఈ వైరస్‌ను గుర్తించారు. ఇందులో చిన్నారులు సైతం ఉన్నారు. ఓ చిన్నారి సహా నలుగురు బాధితుల్లో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ రేటు 15-40 శాతం ఉన్నట్లు నిపుణులు గుర్తించారు.
కొత్త కేసుల్లో ముగ్గురు వయోజనులు రెండు డోసులు తీసుకున్నారని, మరికొందరు ప్రికాషన్ డోసును సైతం స్వీకరించారని అధికారులు తెలిపారు. వీరిలో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ 5 శాతం లోపే ఉన్నట్లు చెప్పారు.
Omicron sub variant severity
ఒమిక్రాన్ వేరియంట్ల లక్షణాల తీవ్రతపై నిపుణులు భిన్నంగా స్పందిస్తున్నారు. లక్షణాలు తీవ్రంగా ఏమీ లేవని పలువురు చెబుతున్నారు. అయితే, మరికొందరు వైద్యనిపుణులు మాత్రం.. ఒమిక్రాన్ బీఏ2 వేరియంట్ ప్రమాదకరమైనదేనని అంటున్నారు.
కాగా.. వయోజనుల్లో ఒమిక్రాన్ తక్కువ ప్రభావమే చూపుతోందని బ్రిటన్ హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ వెల్లడించింది. బీఏ2 స్ట్రెయిన్‌లో 53 సీక్వెన్స్‌లు ఉన్నాయని తెలిపింది. ఇది వేగంగా వ్యాప్తి చెందుతోందని పేర్కొంది.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి: దేశంలో ఒక్కరోజే 3 లక్షల కరోనా కేసులు.. 439 మరణాలు