ETV Bharat / bharat

ఒమిక్రాన్ భయాలు- దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన మహిళ కోసం వేట - ఒమిక్రాన్ వేరియంట్

omicron variant: 'ఒమిక్రాన్' ప్రపంచ దేశాలకు విస్తరిస్తున్న క్రమంలో.. దక్షిణాఫ్రికా నుంచి మధ్యప్రదేశ్​కు వచ్చిన మహిళ కోసం గాలిస్తున్నారు అధికారులు. ఈ నెల 18న ఆమె జబల్​పుర్​కు వచ్చినట్లు ఓ అధికారి తెలిపారు.

Omicron scare
ఒమిక్రాన్ భయాలు
author img

By

Published : Nov 29, 2021, 2:55 PM IST

omicron variant: కరోనా కొత్త వేరియంట్ 'ఒమిక్రాన్​'(Omicron Variant).. ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలో.. ఒమిక్రాన్ మొదట వెలుగుచూసిన దక్షిణాఫ్రికా బోట్స్​వానా నుంచి భారత్​కు వచ్చిన మహిళను పట్టుకునే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ నెల 18న ఆమె మధ్యప్రదేశ్​లోని జబల్​పుర్​కు వచ్చినట్లు ఓ అధికారి తెలిపారు.

"బోట్స్​వానా దౌత్యకార్యాలయం నుంచి ఓ అధికారి మాకు ఫోన్ చేశారు. బోట్స్​వానా నుంచి వచ్చిన మహిళ.. జబల్​పుర్​లోని మిలిటరీ ఆర్గనైజేషన్​లో ఐసోలేషన్​లో ఉన్నట్లు తెలిపారు. సదరు మహిళ ఫోన్​ నంబర్​, స్థానికంగా ఉన్న అడ్రస్​ను షేర్ చేయమని చెప్పాం." అని జబల్​పుర్ వైద్యాధికారి డాక్టర్. రత్నేష్​ కురారియా తెలిపారు.

ఆమె పేరు కునో ఓరెమీట్ సెలిన్ అని.. ఆమె ఎక్కడుందో గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని కురారియా అన్నారు. రికార్డ్స్ ప్రకారం.. సెలిన్​ దిల్లీనుంచి జబల్​పుర్​కు వచ్చినట్లు పేర్కొన్నారు. జబల్​పుర్​ సీసీటీవీ ఫూటేజ్​ను పరిశీలిస్తున్నామని తెలిపారు. జబల్​పుర్​లోని అన్ని హోటల్స్, సరిహద్దు జిల్లాల నుంచి సమాచారం సేకరించామన్నారు.

దక్షిణాఫ్రికా దేశాల్లో కొత్తగా వెలుగుచూసిన బీ.1.1.529 వేరియంట్​ను ఇప్పటికే ఆందోళనకర రకంగా ప్రకటించింది డబ్ల్యూహెచ్​ఓ. దీనికి 'ఒమిక్రాన్' అని నామకరణం చేసింది.

ఇదీ చూడండి: దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా- 'ఒమిక్రాన్​' అని అనుమానం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.