ETV Bharat / bharat

ఒమిక్రాన్​పై రాష్ట్రాలు, యూటీలకు కేంద్రం లేఖ - omicron variant latest news

Omicron News: పలు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదైన దృష్ట్యా తగు జాగ్రత్తలను సూచిస్తూ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ లేఖలు రాసింది. ఒమిక్రాన్ వేరియంట్ సోకిన రోగులను ప్రత్యేకంగా ఐసోలేషన్​లో ఉంచాలని పేర్కొంది.

Omicron news
ఒమిక్రాన్
author img

By

Published : Dec 9, 2021, 7:23 AM IST

Omicron Variant: దేశంలో ఒమిక్రాన్ కేసులు వెలుగుచూసిన నేపథ్యంలో తగు జాగ్రత్తలను సూచిస్తూ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ లేఖలు రాసింది. ఒమిక్రాన్ వేరియంట్ సోకిన రోగులను ప్రత్యేకంగా ఐసోలేషన్​లో ఉంచాలని పేర్కొంది. వార్డుల్లో ఇతర రోగులకు, సిబ్బందికి వైరస్ వ్యాపించకుండా జాగ్రత్తలు పాటించాలని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేశ్ భూషణ్​​ తెలిపారు.

విదేశాల నుంచి వచ్చి వైరస్​ పాజిటివ్​గా తేలినవారి నమూనాలను జీనోమ్​ సీక్వెన్స్ కోసం ల్యాబ్​లకు పంపించాలని లేఖలో పేర్కొన్నారు. ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్​లను కూడా నిశితంగా పరిశీలించాలని తెలిపారు. పాజిటివ్​గా తేలిన అంతర్జాతీయ ప్రయాణికులు తిరిగిన ప్రదేశాలను జిల్లాస్థాయి అధికారులు జాగ్రత్తగా పరిశీలించాలని సూచించారు.

ఇదీ చదవండి:ఆఫ్రికాలో 9 దేశాలకు ఒమిక్రాన్​.. యూకే కొత్త నిబంధనలు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.