ETV Bharat / bharat

ఆ గుడిలోని విగ్రహంపై రోజంతా సూర్య కిరణాలు - పురాతన సూర్యదేవాలయం

కశ్మీర్​లోని అనంతనాగ్​ జిల్లా చారిత్రక కట్టడాలకు పెట్టింది పేరు. అన్ని మతాలకు చెందిన పుణ్యక్షేత్రాలున్న ఈ ప్రాంతంలో... ఓ సూర్య దేవాలయం ఉంది. సూర్యుడి విగ్రహంపై రోజంతా సూర్యకిరణాలు ప్రసరించేలా ఈ ఆలయాన్ని నిర్మించడం విశేషం.

oldest-sun-temple-pathetic-state
కశ్మీర్​ చారిత్రక సంపదకు నిదర్శనం ఈ 'సూర్యదేవాలయం'
author img

By

Published : Mar 31, 2021, 12:12 PM IST

మార్తాండ సూర్యదేవాలయం

పలు పురాతన, చారిత్రక కట్టడాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన కశ్మీర్‌లోని అనంత నాగ్ జిల్లా.. పర్యాటకంగానూ అంతే ఖ్యాతిగాంచింది. అన్ని మతాలకు చెందిన పుణ్య క్షేత్రాలు ఉండడం ఈ జిల్లాకున్న మరో ప్రత్యేకత. అలాంటి ఓ పురాతన, చారిత్రక ప్రాంతమే మార్తాండ సూర్యదేవాలయం. అనంతనాగ్ పట్టణానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న మట్టన్‌లో ఉందీ ఆలయం.

మార్తాండ సూర్య దేవాలయం వేల సంవత్సరాల నాటిది. లలితాదిత్య ముక్తపీడా దీన్ని నిర్మించారు.

--అశోక్ కుమార్ సిద్ధా, మార్తాండ్ తీర్థ ట్రస్ట్ అధ్యక్షుడు

మార్తాండ సూర్యదేవాలయాన్ని.. 8వ శతాబ్దంలో మహారాజా లలితాదిత్య ముక్తపీడ నిర్మించారు. హిందువుల చారిత్రక దేవాలయాల్లో అతి పురాతనమైనదిగా దీనికి పేరుంది. సూర్య దేవుడికి మరో ఆలయం ఒడిశాలోని కోణార్క్ ప్రాంతంలో ఉంది. మార్తాండ సూర్యదేవాలయానికి మొదటగా రానా ఆదిత్య పునాదులు వేశారని చెబుతారు. కృష్ణభగవానుడి కుమారుడు సాంబుడు ఈ ఆలయం నిర్మించినట్లు మరో గాథ ప్రచారంలో ఉంది. ఆ ఆలయాన్నే 8వ శతాబ్దంలో మహారాజు లలితాదిత్య పునర్మించినట్లు చెబుతారు.

"లలితాదిత్య ముక్తపీడా పురాతన కాలంలో ఓ పెద్ద మహల్‌ను నిర్మించారు. ఆ ప్రాంతంలో ఓ విశ్వ విద్యాలయం ఉండేదని చెబుతారు. మహల్ మధ్యలో ఓ వజ్రాన్ని స్థాపించారట. జమ్ము కశ్మీర్ అంతటా దాని వెలుగు ప్రకాశించేదని చెబుతారు. ఈ ఆలయానికి దక్కాల్సినంత ఆదరణ, గౌరవం దక్కడం లేదని నా అభిప్రాయం."

వేల ఏళ్లనాటి ఈ ఆలయంపై నాడు చెక్కిన శిల్పాలు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. ఆలయం మధ్యలో మరో పెద్ద భవంతిని నిర్మించారు. సూర్యుడి విగ్రహంపై రోజంతా సూర్యకిరణాలు ప్రసరించేలా ఆలయం నిర్మితమైంది.

"ఈ ఆలయ నిర్మాణంలో వినియోగించిన డిజైన్లు గ్రీకు వాస్తుశిల్పకళను, రోమన్, బైజంటైన్ శిల్పకళలకు అద్దంపడతాయి. లలితాదిత్య.. టర్కీ జవాన్ల సాయంతో ఈ ఆలయాన్ని నిర్మించాడు. అందుకే బైజంటైన్ శిల్పకళను వినియోగించారు. లలితాదిత్య ఓ లౌకికవాది."

--రావ్ ఫర్మాన్ అలీ, పరిశోధకుడు

ఈ సూర్య దేవాలయం జాతీయ రహదారికి సమీపంలోనే ఉన్నప్పటికీ.. ఆధ్యాత్మిక, పర్యటక ప్రాంతాల జాబితాలో చోటు దక్కలేదు.

"మార్తాండ్ సూర్య దేవాలయం ప్రత్యేకత ఏంటంటే.. అన్ని రకాల నాగరికతలను ప్రతిబింబిస్తుంది. ఈ ఆలయాన్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, జమ్ము కశ్మీర్ పురావస్తు విభాగాలదే. ఇప్పటివరకు అధికారులు ఆ దిశగా ఏమీ చేయలేదు."

--రావ్ ఫర్మాన్ అలీ, పరిశోధకుడు

జమ్ముకశ్మీర్ చారిత్రక సంపదను సంరక్షించుకునేందుకు పాటుపడుతున్నవారంతా ఈ ఆలయ పరిరక్షణపై దృష్టి సారించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆలయ పునరాభివృద్ధి చేపడితే, స్థానికులకూ ఉపాధి దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి:8 రోజుల్లో సైకిల్​పై కశ్మీర్ నుంచి కన్యాకుమారికి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.