ETV Bharat / bharat

'చమురు ధరలపై ప్రధాని మాట్లాడరేం?' - భారత్​లో చమురు ధరలు

'చమురు ధరలపై ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు చర్చించరు' అని కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ ప్రశ్నించారు. ఈ విషయం పరీక్షల కంటే చిన్నది కాదన్న రాహుల్​.. దీనిపై కచ్చితంగా చర్చ జరపాలన్నారు.

Rahul Gandhi
రాహుల్​ గాంధీ
author img

By

Published : Apr 8, 2021, 3:26 PM IST

వాహనాల్లో ఇంధనం నింపడం.. పరీక్షలు కంటే చిన్న విషయం కాదని కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ. పరీక్షల మీదే కాదు.. చమురు ధరలపై తప్పనిసరిగా ప్రధాని నరేంద్ర మోదీ చర్చించాలని పేర్కొన్నారు. 'పరీక్షా పే చర్చ' కార్యక్రమం ద్వారా విద్యార్థులతో ప్రధాని మాట్లాడిన నేపథ్యంలో రాహుల్​ ఈ వాఖ్యలు చేశారు.

"వాహనాల్లో ఇంధనం నింపడం పరీక్షల కంటే తక్కువ కాదు. కేంద్ర ప్రభుత్వం విధించిన అధిక పన్నులే చమురు ధరల పెరగుదలకు కారణం. దీనిపై ప్రధాని ఎందుకు చర్చించడంలేదు? వ్యయంతో కూడుకున్న ఈ వ్యవహారంపై కచ్చితంగా చర్చించాలి." అని హిందీలో ట్వీట్​ చేశారు రాహుల్​.

చమురు ధరల పెరుగుదల సామాన్య ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గత ఎనిమిది రోజులుగా ముడి చమురు ధరలు తగ్గినప్పటికీ.. దేశంలో పెట్రోలు, డీజిల్​ ధరల తగ్గకపోవడం గమనార్హం.

ఇదీ చూడండి: కేంద్రం సాయంపై శరద్​ పవార్​ కీలక వ్యాఖ్యలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.