ఒడిశా కేంద్రపార పట్టణంలో అవిభక్త కవలలు జన్మించారు. రెండు తలలు, మూడు చేతులు, రెండు కాళ్లతో వీరు పుట్టారు. కవలలు ఆడపిల్లలుకాగా.. వారి ఛాతీ, కడుపు భాగం పూర్తిగా కలిసిపోయి ఉంది.
వైద్య పరిస్థితి దృష్ట్యా చిన్నారులను.. జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతానికి వీరి ఆరోగ్యం నిలకడగా ఉందని జిల్లా వైద్యాధికారులు తెలిపారు. ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ తర్వాత వారి అసహజ రూపంపై పూర్తి స్పష్టత వస్తుందని వివరించారు. వారిని కటక్‌లోని శిశు భవన్‌కు సిఫార్సు చేస్తున్నట్లు వెల్లడించారు.
గతంలో..
2015లో జగ-ఖలియా అనే కవలలు ఇదే విధంగా జన్మించారు. 2017లో ప్రభుత్వ ఖర్చుతో వారిని ఎయిమ్స్ వైద్యులు వేరు చేశారు. అయితే గత ఏడాది ఖలియా మరణించాడు.