ETV Bharat / bharat

మేకల్ని దొంగలించిన పోలీస్- న్యూఇయర్ పార్టీ కోసం.. - మేకల దొంగ పోలీసు

Police steals goats: కొత్త సంవత్సర వేడుకల కోసం ఓ పోలీసు అధికారి.. మేకలను దొంగతనం చేశాడు. వాటిని వధించి తన సహచరులతో కలిసి పార్టీ చేసుకున్నాడు. చివరకు అధికారుల ఆగ్రహానికి గురై.. సస్పెండ్ అయ్యాడు.

Odisha cop steals goats to throw New Year feast

author img

By

Published : Jan 2, 2022, 5:30 AM IST

Police steals goats: న్యూఇయర్ వేడుకల కోసం ఓ పోలీసు అధికారి మేకలు దొంగతనం చేసిన ఘటన ఒడిశాలో జరిగింది. బాలంగిర్ జిల్లాలోని సింధేకాలా పోలీస్ స్టేషన్​లో అసిస్టెంట్ సబ్-ఇన్​స్పెక్టర్​గా పనిచేస్తున్న సుమన్ మల్లిక్.. తన సహచరులతో కలిసి రెండు మేకలను దొంగలించాడు. వాటిని న్యూఇయర్ పార్టీ కోసం వధించారు.

Odisha cop steals goats to throw New Year feast
ఏఎస్ఐ సుమన్ మల్లిక్

'మేకల యజమాని సంకీర్తన గురు.. జంతువులను వధించొద్దని పోలీసులను బతిమిలాడాడు. అయినా మల్లిక్ వినలేదు. చుట్టుపక్కలవారినీ మల్లిక్ బెదిరించాడు. మేకలను కోసి తన సహచరులతో కలిసి పార్టీ చేసుకున్నాడు' అని స్థానికులు తెలిపారు.

ఈ ఘటనతో ఆగ్రహం చెందిన స్థానికులు.. పెద్ద సంఖ్యలో సింధేకాలా పోలీస్ స్టేషన్​కు చేరుకున్నారు. ఏఎస్ఐ సహా అతని సహచరులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ వ్యవహారంపై బాలంగిర్ ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికులను శాంతింపజేసేలా.. ఏఎస్ఐ సుమన్ మల్లిక్​ను సస్పెండ్ చేశారు. స్థానికులు శాంతించాలని కోరారు.

ఇదీ చదవండి: ఆలయంలో పూజలు చేస్తూ జవాన్ల న్యూఇయర్ వేడుకలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.