రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా.. కనీసం హెల్మెట్ కూడా ధరించకుండా బైక్ నడిపిన ఓ వ్యాపారికి అధికారులు రూ. 1.13 లక్షల జరిమానా విధించారు. ఒడిశాలోని రాయగడ డీవీఐ కూడలి వద్ద బుధవారం పోలీసులు, ఆర్టీవో సిబ్బంది తనిఖీల్లో భాగంగా.. ప్లాస్టిక్ డ్రమ్ముల వ్యాపారం చేసే, మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రకాశ్ బంజారను ఆపారు. అతడు తన వాహనానికి 8 డ్రమ్ములు కట్టుకుని వెళ్తున్నాడు. దీంతో పత్రాలు అడగ్గా ప్రకాశ్ ఏమీ చూపించలేకపోయాడు.
తనిఖీ చేయగా వాహనానికి రిజిస్ట్రేషన్ చేయించలేదని, ఏ విధమైన పత్రాలూ లేవని గుర్తించారు. దీంతో భారీ మొత్తంలో జరిమానా విధించారు. ప్రకాశ్ అప్పటికప్పుడు తన సన్నిహితుల వద్ద నుంచి డబ్బు తీసుకుని జరిమానా మొత్తాన్ని చెల్లించాడు.
ఇదీ చదవండి:రంగు తెచ్చిన తంట- వీరంగం సృష్టించిన ఆవు