ETV Bharat / bharat

జీతం కోసం నాలుగేళ్లుగా పోరాటం.. చివరకు కటకటాల్లోకి.. - డీఈఓపై దాడి

odisha headmistress arrest: నాలుగేళ్లుగా తన భార్యకు జీతం ఇవ్వడం లేదంటూ జిల్లా విద్యాశాఖ అధికారిపై దాడికి పాల్పడ్డాడు ఓ ప్రధానోపాధ్యాయురాలి భర్త. ఈ ఘటన ఒడిశాలోని గంజాం జిల్లాలో జరిగింది.

odisha  headmistress arrest
ఒడిశా
author img

By

Published : Apr 27, 2022, 6:39 AM IST

odisha headmistress arrest: తన భార్య జీతాన్ని గత నాలుగేళ్లుగా నిలిపివేసిందన్న కోపంతో జిల్లా విద్యాశాఖ అధికారి(డీఈఓ)పై దాడికి పాల్పడ్డాడు ఓ ప్రధానోపాధ్యాయురాలి భర్త. ఈ ఘటన మంగళవారం ఒడిశాలోని గంజాం జిల్లాలో జరిగింది. గత నాలుగేళ్ల నుంచి తన భార్యకు జీతం రాకుండా మహిళా విద్యాధికారి అడ్డుకుంటోందని ఆరోపించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

అసలేం జరిగిదంటే..: బెల్లగుంటలోని బాలికల ఉన్నత పాఠశాలలో శాంతిలత సాహు ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. తనకు రావాల్సిన నాలుగేళ్ల జీతాన్ని విడుదల చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) కార్యాలయ ఆవరణలో నాలుగు నెలలుగా దీక్ష చేస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం.. భోజనానికి వెళ్తున్న డీఈవోను ప్రధానోపాధ్యాయుల దంపతులు అడ్డగించి జీతం మంజూరు చేయాలని కోరారు. ఆ సమయంలో వివాదం జరగడం వల్ల కోపంతో పక్కనే ఉన్న ప్రధానోపాధ్యాయురాలి భర్త.. డీఈవో ముఖంపై కొట్టాడని పోలీసులు తెలిపారు. దాడికి పాల్పడిన వారిద్దరినీ పోలీస్​ స్టేషన్ తరలిస్తున్న సమయంలో నిందితుడు ఏడ్చాడని వెల్లడించారు. తన భార్య శాంతిలతకు అనవసరంగా జీతాన్ని నిలిపివేశారని వాపోయాడని పేర్కొన్నారు. డీఈవోపై పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా.. ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని అతను చెప్పారని అన్నారు. ప్రధానోపాధ్యాయురాలు సాహుని విధుల్లో చేరాలని కోరినప్పటికీ ఆమె చేరట్లేదని డీఈఓ కార్యాలయంలో ఒకరు తెలిపారు.

ఇదీ చదవండి: బస్సు బోల్తా.. ఆరుగురు దుర్మరణం.. 25 మందికి గాయాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.