ETV Bharat / bharat

నగలు తాకట్టుపెట్టి ఊరికి ఉపకారం.. సొంతంగా వంతెన, రోడ్డు నిర్మించిన తండ్రీకొడుకులు

ఆ ఊరికి వెళ్లాలంటే నది దాటాలి. కానీ అది దాటడానికి బ్రిడ్జ్​ లేదు. ఈ కారణంగా ఇబ్బంది పడుతున్న తన గ్రామ ప్రజలకు ఏదైనా చేయాలనుకున్నాడు ఓ డ్రైవర్​. ఉపాధిని వదులుకొని, తన భార్య నగులు తాకట్టు పెట్టి బ్రిడ్జ్​ కట్టాడు. కుమారుడి ఆశయానకి తండ్రి కూడా సహాయం చేశాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..

odisha driver build bridge on river
odisha driver build bridge on river
author img

By

Published : Dec 15, 2022, 7:37 AM IST

నదికి అవతల ఉన్న గ్రామం నుంచి రాకపోకల్లేక ఇబ్బంది పడుతున్న ప్రజలను చూసి ఓ డ్రైవర్‌ ఏకంగా వంతెననే ఏర్పాటు చేశారు. ఉపాధిని వదులుకొని, భార్య నగలు తాకట్టు పెట్టి మరీ ఊరి కోసం పాటుపడ్డారు. ఒడిశాలోని రాయగడ జిల్లా కాశీపూర్‌ సమితి డొంగశిలి పంచాయతీలోని గుంజరం పంజరి గ్రామానికి చెందిన రంజిత్‌ నాయక్‌ డ్రైవర్‌గా పని చేసేవారు. 120 కుటుంబాలు నివసించే గుంజరం పంజరి బిచులి నదికి అవతల ఉంది.

odisha driver build bridge on river
.

ఏ అవసరం వచ్చినా నదిలో దిగి వెళ్లాలి. అత్యవసర సమయంలో వైద్యం అందక పలువురు చనిపోయిన ఘటనలూ ఉన్నాయి. అది చూసిన రంజిత్‌ నదిపై వంతెన నిర్మించాలనుకున్నారు. ఉపాధిని పక్కన పెట్టి, భార్య బంగారాన్ని తాకట్టు పెట్టారు. వచ్చిన రూ.70 వేలతో కర్రలతో వంతెన నిర్మిస్తానని తండ్రికి చెప్పారు. కుమారుడి లక్ష్యం నచ్చిన ఆ పెద్దాయనా అతనికి సాయంగా పనిలోకి దిగారు. ఇద్దరూ కలసి నదిపై కర్రల వంతెన నిర్మించారు. నది దగ్గర నుంచి ఊరిలోకి వెళ్లేందుకు పొదలు తొలగించి, 4 కి.మీ. మేర మట్టి రోడ్డు వేశారు. నాలుగు నెలలు శ్రమించి గ్రామానికో రోడ్డేశారు. 'దారి వేయాలని అధికారులు చుట్టూ తిరిగి అలసిపోయా. అందుకే కర్రల వంతెన, రోడ్డు నిర్మించా' అని రంజిత్‌ తెలిపారు. ఈ విషయంపై సమితి అధికారి మోనిసా దాస్‌ను సంప్రదించగా.. వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.