ఒడిశాలో బాల్య వివాహాలకు అడ్డుకుట్ట వేసేందుకు వధూవరులకు ఆధార్ కార్డు తప్పనిసరి చేసింది గంజాం జిల్లా పాలనా యంత్రాంగం. ఆధార్ కార్డు కలిగిన వధూవరులిద్దరూ.. వివాహ వయసు దాటాక సంబంధిత కార్యాలయంలో తమ పేర్లు నమోదు చేయించుకోవాలని నిబంధన విధించింది.
ఇదీ నిబంధన..
మనువాడబోయే వధూవరులిద్దరూ ఆధార్ కార్డును కలిగి ఉండాలి. అందులో పుట్టిన తేదీ వివరాలు.. వివాహ వయసుకు అనుగుణంగా ఉండాలి. ఈ విశిష్ట గుర్తింపు సంఖ్యను వివాహ నమోదు ప్రక్రియలో ఉపయోగిస్తారు అక్కడి జిల్లా అంగన్వాడీ కార్యకర్తలు. ఆ తర్వాత సంబంధిత అధికారుల ధ్రువీకరణ అనంతరం పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది.
గంజాం జిల్లాలో తెచ్చిన ఈ కొత్త నిబంధన వల్ల.. 2019-20 ఏడాదిలో సుమారు 172 బాల్య వివాహాలను అడ్డుకున్నట్టు అధికారులు పేర్కొన్నారు. ఇక ఈ ఏడాదిలో ఒక్క నెలలోనే సుమారు 62 బాల్య వివాహాలకు అడ్డకట్ట వేశారట.
ఇదీ చూడండి: కళ్లకు గంతలతో పజిల్ పూర్తి..13 ఏళ్లకే రికార్డులు