ETV Bharat / bharat

నాసా పోటీలకు ఒడిశా విద్యార్థుల 'రోవర్'​ - NASA Human Rover Exploration Challenge 2021

ఒడిశాకు చెందిన ఓ విద్యార్థి బృందం సరికొత్త రోవర్​ను అభివృద్ధి చేసింది. ఈ ఏడాది.. నాసా హ్యూమన్​ రోవర్​ ఎక్స్​ప్లొరేషన్​ ఛాలెంజ్​ పోటీల్లో దీన్ని ప్రదర్శనకు ఉంచనున్నారు. ఇతర గ్రహాలపై ఎలాంటి భూభాగంలోనైనా పని చేసే సామర్థ్యంతో ఈ రోవర్​ను రూపొందించారు.

Cuttack-based astronomy team designs rover to exhibit at NASA challenge
ఒడిశా విద్యార్థుల 'రోవర్'​ ఆవిష్కరణ
author img

By

Published : Apr 12, 2021, 10:22 AM IST

Updated : Apr 12, 2021, 10:57 AM IST

ఒడిశా కటక్​లోని నవోన్మేష్​ ప్రసార్​ స్టూడెంట్​ ఆస్ట్రానమీ టీమ్​(నాప్​సాట్​) సరికొత్త రోవర్​ను రూపొందించింది. 10 మంది పాఠశాల విద్యార్థులు కలిసి ఆవిష్కరించిన ఈ రోవర్​ను.. అమెరికా అంతరిక్ష పరిశోధన కేంద్రం(నాసా) హ్యూమన్​ రోవర్​ ఎక్స్​ప్లొరేషన్​ ఛాలెంజ్​-2021లో ప్రదర్శనకు ఉంచనున్నారు.

Cuttack-based astronomy team designs rover to exhibit at NASA challenge
రోవర్​తో నాప్సాట్​ సభ్యులు

'ఆర్టెమిస్​ మిషన్​' కోసం..

ఇతర గ్రహాలపై ఉండే విభిన్న భూభాగాల్లోనూ పనిచేసే విధంగా ఈ రోవర్​ను రూపొందించినట్లు తెలిపారు విద్యార్థులు. నాసా ఆర్టెమిస్​ మిషన్​ రోవర్​ రూపొకల్పనకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.

"2024లో నాసా చేపట్టబోయే 'ఆర్టెమిస్​ మిషన్​' కోసం ఈ రోవర్​ను రూపొందించాం. అక్కడి పరిస్థితులకు అనుగుణంగా.. ఎలాంటి భూభాగంలోనైనా ప్రయాణించే సామర్థ్యం ఈ రోవర్​ సొంతం."

- నాప్​సాట్​ సభ్యుడు

ఇదీ చదవండి: చంద్రుడికి కూడా తుప్పు పడుతుందా..?

నాసా ప్రదర్శనకు తమ బృందం ఎంపికైనట్లు గతేడాది నవంబర్​ 6న తమకు ఓ లేఖ అందినట్లు నవోన్మేష్​ ప్రసార్​ ఫౌండేషన్​ తెలిపింది. వివిధ ప్రాంతాలకు చెందిన 10 మంది విద్యార్థులు బృందంగా ఏర్పడి.. కరోనా పరిస్థితుల్లోనూ 8 నెలలు కష్టపడి ఈ రోవర్​ను ఆవిష్కరించినట్లు వెల్లడించింది. నాసా నుంచి నాప్సాట్​ 1.0 తరఫున భారత్​కు ఓ అవార్డును తీసుకొచ్చేందుకు కృషిచేస్తున్నామంది.

తాము ఆవిష్కరించిన రోవర్​తో..

ఈ నెల 15-17 వరకు అలబామాలో నాసా హ్యూమన్​ రోవర్​ ఎక్స్​ప్లొరేషన్​ పోటీలు జరగనున్నాయి. అయితే.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో నాప్సాట్​ బృందం అలబామా వెళ్లలేకపోయింది.

ఇవీ చదవండి:

అంతరిక్షయాత్రలో చరిత్ర సృష్టించిన 'స్పేస్​ ఎక్స్​'

అంతరిక్షంలో ముల్లంగిని సాగు చేసిన నాసా

Last Updated : Apr 12, 2021, 10:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.