ఒడిశా శాసనసభలో శనివారం అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. భాజపా శాసనసభ్యులు సభాపతి సూర్యనారాయణ్ పాత్ర వైపు చెప్పులు, డస్ట్‌బిన్లు, ఇయర్‌ఫోన్లు విసిరారు. లోకాయుక్త చట్ట సవరణ బిల్లుపై చర్చకు అవకాశం కల్పించలేదనే కారణంతో వారు ఈ చర్యకు పాల్పడ్డారు. ఈ పరిణామంతో శనివారం ఒడిశా శాసనసభలో ఉద్రిక్తత నెలకొంది.
ఈ ఘటన జరిగిన వెంటనే సభను కొద్ది సేపు వాయిదా వేశారు. సభాపతిపై అనుచితంగా ప్రవర్తించిన జయనారాయణ మిశ్రా, బిష్ణు చరణ్, మోహన్ మఝీలను స్పీకర్ సభ నుంచి సస్పెండ్ చేశారు. ఈ సస్పెండ్‌ను నిరసిస్తూ భాజపా శాసనసభ్యులు ఒడిశా శాసనసభ ఆవరణలో ధర్నా నిర్వహించారు.
ఇదీ చూడండి: బంగాల్ నాలుగో దశలో 22% అభ్యర్థులు నేరచరితులే..