ETV Bharat / bharat

చదివేది నర్సింగ్​.. ఆర్మీ ఆఫీసర్​గా చలామణీ

Nursing student arrest: ఆర్మీ ఆఫీసర్​గా చలామణీ అవుతున్న ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు రాజస్థాన్​కు చెందిన నర్సింగ్ విద్యార్థిగా పోలీసులు గుర్తించారు.

Nursing student arrest
నర్సింగ్ విద్యార్థి అరెస్టు
author img

By

Published : Mar 31, 2022, 7:51 AM IST

Nursing student arrest: భారత ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్‌ అంటూ చలామణీ అవుతున్న ఓ విద్యార్థిని మానససరోవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు రాజస్థాన్​లోని అల్వార్‌కు చెందిన అమర్‌సింగ్‌గా గుర్తించారు. నిందితుడు ఆర్మీ యూనిఫారం ధరించి తిరుగుతున్నాడని వెల్లడించారు. అమర్​సింగ్ నర్సింగ్ విద్యార్థి అని పోలీసులు తెలిపారు. తనతో పాటు చదువుతున్న తోటి విద్యార్థులకు తాను రెండేళ్లు స్టడీ లీవ్​లో ఉన్నానని నమ్మబలికాడని తెలుస్తోంది.

నిందితుడు అమర్​సింగ్ ఆర్మీ క్యాంటిన్​ను సందర్శించాడు. టోల్ టాక్స్ ప్లాజాల వద్ద నకిలీ గుర్తింపు కార్డులను చూపించి టోల్ ఛార్జీలు చెల్లించేవాడు కాదని పోలీసులు తెలిపారు. నిందితుడి నివాసంపై పోలీసులు దాడులు జరపగా.. అతని ఇంట్లో ఆర్మీ, వైద్య అధికారులు, నోటరీ పబ్లిక్‌కు చెందిన అనేక నకిలీ రబ్బరు స్టాంపులు పోలీసులకు లభించాయి. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి: నటిపై దర్శకుడి అత్యాచారం.. ఆ వీడియో లీక్ చేస్తానని బెదిరించి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.