NTR Centenary Celebrations 2023 : తెలుగుజాతి గర్వించదగిన వ్యక్తి.. ఐక్యత, భారత రాజ్యాంగ విలువలు గల మహనీయుడు ఎన్టీఆర్ అని పలువురు ప్రముఖులు కొనియాడారు. ఎన్టీఆర్ లిటరేచర్, సావనీర్, వెబ్‌సైట్ కమిటీ అధ్యక్షుడు టీడీ జనార్దన్ అధ్యక్షతన ఏర్పాటైన సమావేశంలో ఎన్టీఆర్ ప్రసంగాలపై సమాలోచన నిర్వహించారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి విజయేంద్ర ప్రసాద్ పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ లిటరేచర్, సావనీర్, వెబ్‌సైట్ కమిటీ ఆధ్వర్యంలో వెలువరించిన "నందమూరి తారక రామారావు శాసనసభ ప్రసంగాలు", "చారిత్రక ప్రసంగాలు", "శక పురుషుడు" గ్రంథాలపై సమాలోచన చేశారు. ఎన్టీఆర్‌లోని క్రమశిక్షణ, కృషి, అంకితభావం, లక్ష్యసాధన.. నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు.
ఎన్టీఆర్‌ది గొప్ప విలక్షణ వ్యక్తిత్వం.. ప్రాణం పోయినా తప్పు చేయకూడదని నమ్మిన వ్యక్తి అని జయప్రకాశ్ నారాయణ తెలిపారు. అసాధారణ క్రమశిక్షణ గల మహానుభావుడు.. ప్రభావ శీలమైన వ్యక్తిత్వం ఎన్టీఆర్‌ది అని ప్రశంసించారు. భారతదేశంలో తెలుగు జాతి అభ్యున్నతి, సంక్షేమం కోసం ఎంతో సేవ చేశారని.. నిజమైన జాతీయ భావాలు గల గొప్ప వ్యక్తి అని శ్లాఘించారు. ధర్మం నమ్మిన వ్యక్తి.. రాజీలేని పోరాట పోరాట పటిమ ఎన్టీఆర్ సొంతం.. ఆయన ఆశయాలు భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందని సుమన్ అభిప్రాయపడ్డారు.
'తెలుగుజాతి గర్వించదగిన వ్యక్తి ఎన్టీఆర్.. ఐఖ్యత, భారత రాజ్యాంగ విలువలు గల మహానీయుడు. అసాధారణ క్రమశిక్షణ గల మహానుభావుడు.. ప్రభావశీలమైన వ్యక్తిత్వం ఆయన సొంతం. భారతదేశంలో తెలుగు జాతి అభ్యున్నతి, సంక్షేమం కోసం ఎంతో సేవ చేశారు. నిజమైన జాతీయ భావాలు గల గొప్ప వ్యక్తి ఎన్టీఆర్‌ను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలి.' - జయప్రకాశ్ నారాయణ
తన తండ్రి ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ.. నందమూరి రామకృష్ణ భావోధ్వేగానికి గురయ్యారు. ప్రజల కోసం జీవితం అంకితం చేసిన ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువేనని ఆయన తన జ్ఞాపకాలు స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు విజయేంద్రప్రసాద్, ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ, ప్రముఖ నటుడు సుమన్, రచయిత పరుచూరి గోపాలకృష్ణ, దర్శకుడు బి.గోపాల్, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి, నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
'ధర్మం నమ్మిన వ్యక్తి.. రాజీలేని పోరాటం, పోరాట పటిమ ఎన్టీఆర్ సొంతం. ఆయన ఆశయాలు భావితరాలకు అందించాల్సిన అవసరం ఉంది. తెలుగుజాతి కీర్తిని ఉన్నత స్థాయికి చేర్చాడు. ఎన్టీఆర్‌లోని క్రమశిక్షణ, కృషి, అంకితభవం, లక్ష్యసాధన.. నేటి యువత స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలి.' - సుమన్, సినీ నటుడు
ఇవీ చదవండి: