జేఈఈ మెయిన్ షెడ్యూల్ను విడుదల చేసింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. నాలుగు విడతల్లో జేఈఈ మెయిన్ నిర్వహించాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 22 నుంచి 25 వరకు జేఈఈ మెయిన్ మొదటి పరీక్ష జరగనుంది. మంగళవారం నుంచి జనవరి 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నారు.
రోజుకు రెండు విడతల్లో ఆన్లైన్లో ఈ పరీక్షలను ఏర్పాటు చేసింది ఎన్టీఏ. అయితే మరో 3 విడతల్లో పరీక్షలు.. మార్చి, ఏప్రిల్, మే నెలలో జరగనున్నాయి.