ETV Bharat / bharat

'గూర్ఖాలపై ఎన్​ఆర్​సీ ప్రభావం ఉండదు' - అమిత్ షా వార్తలు

ఎన్​ఆర్​సీ వల్ల గూర్ఖాలపై ఎలాంటి ప్రభావం ఉండదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఎన్​ఆర్​సీ అమలులోకి వచ్చినా.. ఒక్క గూర్ఖానూ వెళ్లిపోవాలని అడగమని చెప్పారు.

amit shah bengal visit, bengal campaign amit shah
అమిత్ షా బంగాల్ ప్రచారం, గూర్ఖాలపై ఎన్ఆర్​సీ ప్రభావం, అమిత్ షా బంగాల్ పర్యటన, బంగాల్ ఎన్నికలు అమిత్ షా
author img

By

Published : Apr 12, 2021, 3:11 PM IST

జాతీయ పౌర పట్టిక(ఎన్ఆర్​సీ) వల్ల గూర్ఖాలపై ఎలాంటి ప్రభావం ఉండబోదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. బంగాల్​లోని కాలింపోడ్​లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. అధికార తృణమూల్ కాంగ్రెస్​పై విమర్శలు చేశారు. కొండ ప్రాంతాల్లోని ప్రజల్లో భయం సృష్టించేందుకు టీఎంసీ అసత్యాలను వ్యాప్తి చేస్తోందని ఆరోపించారు.

  • #WATCH: HM and BJP leader Amit Shah says in Kalimpong, WB. "Misinformation being spread that if NRC will be brought, Gorkhas will be ousted. NRC hasn't been brought yet. But even if it's brought, not even one Gorkha will be ousted. TMC lies. Not even one Gorkha will be affected." pic.twitter.com/awrGvSX46Y

    — ANI (@ANI) April 12, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"మోదీ నేతృత్వంలోని భాజపా ప్రభుత్వం కేంద్రంలో ఉన్నంత వరకు.. ఒక్క గూర్ఖాకు హాని జరగదు. ఎన్ఆర్​సీ ఇంకా అమలు కాలేదు. కానీ, ఎప్పుడు అమలులోకి వచ్చినా.. ఒక్క గూర్ఖాను వెళ్లిపోవాలని చెప్పం. ఎన్ఆర్​సీ గురించి టీఎంసీ అబద్ధాలు చెబుతోంది. గూర్ఖాల్లో భయం సృష్టించేందుకు ప్రయత్నిస్తోంది."

-అమిత్ షా, కేంద్ర హోంమంత్రి

ఎన్నో ఏళ్ల నుంచి కాలింపోడ్​ ప్రాంతం అనేక సమస్యలను ఎదుర్కొంటోందని అన్నారు షా. 1986లో గూర్ఖాలపై సీపీఎం అణచివేతకు పాల్పడిందని.. అప్పుడు 12 వందల మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. దీదీ సైతం గూర్ఖాల ప్రాణాలు తీశారని ఆరోపించారు. భాజపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సిట్ ఏర్పాటు చేసి దోషులందరినీ కటకటాల వెనక్కి పంపిస్తామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: 'దేశంలో ప్రతి ఒక్కరికి టీకా అవసరం'​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.