ETV Bharat / bharat

'ఎల్​ఏసీ వద్ద 'చైనా రోబో' సైన్యమా? ఒక్కరూ లేరే!' - రోబో సైన్యం

China Robo Soldiers: చైనా సైన్యంలో రోబోలను మోహరించినట్లు అక్కడి మీడియాలో కథనాలు వస్తున్న వేళ.. భారత భద్రతా దళాల ఉన్నత వర్గాలు స్పందించాయి. సరిహద్దుల్లో ఒక్క రోబో సైనికుడు కూడా కనిపించలేదని, కానీ చలిని తట్టుకోలేని డ్రాగన్​ సైనికులకు ఇవి ఉపకరిస్తాయని పేర్కొన్నాయి.

China robotic soldier
China robotic soldier
author img

By

Published : Jan 7, 2022, 7:18 PM IST

China Robo Soldiers: వాస్తవాధీన రేఖ(ఎల్​ఏసీ) వెంబడి సహా సరిహద్దుల్లో ఎలాంటి రోబో సైనికులు కనిపించలేదని తెలిపాయి భారత భద్రతా దళాల్లోని ఉన్నత వర్గాలు. చైనా ఆర్మీలో రోబో సైనికులను మోహరించినట్లు అక్కడి మీడియాలో కథనాలు వస్తున్న నేపథ్యంలో ఈమేరకు స్పందించాయి.

తుపాకులతో ఉన్న రోబో సైనికులు కంటపడలేదని భారత ఆర్మీ అధికారులు తెలిపారు. ఒక్క రోబో సైనికుడు ఎల్​ఏసీ వెంట లేకున్నా.. ఆ నిర్ణయం చలికి అసలు తట్టుకోలేని డ్రాగన్​ పీపుల్స్​ లిబరేషన్​ ఆర్మీకి ఉపకరిస్తుందని చెప్పారు.

''శీతాకాలం ఎముకలు కొరికే చలిలో చైనా సైనికులు ఉండలేరు. సైన్యంలో రోబోలను మోహరించడం చైనా పీపుల్స్​ లిబరేషన్​ ఆర్మీకి ఉపకరిస్తుంది. అది వారికి మేలు చేసేదే.''

- ఆర్మీ ఉన్నత వర్గాలు

అంతటి చలిలో గస్తీ కాయడం డ్రాగన్​ సైనికులకు పెను సవాలేనని, తమ శిబిరాల్లో నుంచి అలా వచ్చి కాసేపట్లోనే లోపలికి వెళ్లిపోతారని సైనిక వర్గాలు వెల్లడించాయి. గతేడాది కూడా చైనా సైన్యానికి ఈ ఇబ్బందులు తప్పలేదని వివరించాయి.

భారత దళాలు పవర్​ఫుల్​..

భారతీయ సాయుధ దళాలు.. ఎత్తైన పర్వత ప్రాంతాల్లో క్లిష్ట పరిస్థితులకు అలవాటుపడ్డాయి.

భారత సైన్యం తమ సైనికులను రెండేళ్ల పాటు ఎత్తైన ప్రాంతాల్లో మోహరిస్తూ ఉంటుంది. అక్కడే.. ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా ఎదుర్కొని దీటుగా నిల్చొనే శిక్షణ పొందుతాయి.

బలవంతంగా..

మైనస్​ 20-40 డిగ్రీల సెల్సియస్​ ఉష్ణోగ్రతలు ఉండే.. భారత సరిహద్దుల వెంబడి చైనా భద్రతా సిబ్బంది బలవంతంగా కాపు గాస్తున్నారు. ఉన్నత అధికారుల కఠిన ఆదేశాలతో వారు వరుసగా రెండో ఏడాది అక్కడే ఉండాల్సి వస్తుంది.

ఇవీ చూడండి: చైనాకు కేంద్రం చురకలు.. ఆ పని మానుకోవాలని హితవు

సరిహద్దుల్లో డ్రాగన్‌ కవ్వింపులు.. దౌత్యంతోనే సరైన ప్రయోజనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.