ETV Bharat / bharat

'8-10 ఏళ్ల తర్వాతే జీఎస్​టీ పరిధిలోకి పెట్రోల్!' - పెట్రోల్ డీజిల్ ఆదాయం

వచ్చే 8-10 ఏళ్ల వరకు పెట్రోల్, డీజిల్​ను జీఎస్​టీ పరిధిలోకి తీసుకొచ్చే అవకాశం లేదని భాజపా ఎంపీ సుశీల్ కుమార్ మోదీ పేర్కొన్నారు. పెట్రోలియం ఉత్పత్తులపై జీఎస్​టీ విధిస్తే.. రూ. 2 లక్షల కోట్లకుపైగా నష్టం వాటిల్లుతుందని చెప్పారు.

Not possible to bring petrol, diesel under GST for next 8-10 years: Sushil Modi
'పదేళ్ల వరకు జీఎస్​టీ పరిధిలోకి పెట్రోల్ లేనట్లే'
author img

By

Published : Mar 24, 2021, 2:21 PM IST

పెట్రోల్​, డీజిల్​ను జీఎస్​టీ పరిధిలోకి తెచ్చే అవకాశమే లేదని భాజపా ఎంపీ సుశీల్ కుమార్ మోదీ స్పష్టం చేశారు. వచ్చే 8-10 సంవత్సరాల వరకు ఇది సాధ్యం కాదని తేల్చి చెప్పారు. పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్​టీ పరిధిలోకి తీసుకొస్తే వార్షికంగా రూ.2 లక్షల కోట్ల రెవెన్యూ నష్టం ఏర్పడుతుందని తెలిపారు.

ఆర్థిక బిల్లుపై చర్చ సందర్భంగా రాజ్యసభలో మాట్లాడిన సుశీల్.. పెట్రోలియం ఉత్పత్తుల ద్వారా కేంద్ర, రాష్ట్రాలు కలిసి రూ.5 లక్షల కోట్ల పన్ను వసూలు చేశాయని తెలిపారు.

"వచ్చే 8-10 సంవత్సరాల వరకు పెట్రోల్-డీజిల్​ను జీఎస్​టీ పరిధిలోకి తీసుకురావడం సాధ్యం కాదు. పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్​టీ పరిధిలోకి తీసుకొస్తే... 28 శాతం పన్ను విధించాల్సి ఉంటుంది. ప్రస్తుతం వీటిపై 60 శాతం పన్ను ఉంది. జీఎస్​టీ పరిధిలోకి వస్తే.. కేంద్రం, రాష్ట్రాలకు రూ.2 లక్షల కోట్ల నుంచి రూ.2.5 లక్షల కోట్ల మధ్య నష్టం ఏర్పడుతుంది. వీటిని జీఎస్​టీ పరిధిలోకి తీసుకొస్తే రూ.2 లక్షల కోట్ల రెవెన్యూ లోటు ఎలా భర్తీ అవుతుంది?"

-సుశీల్ కుమార్ మోదీ, భాజపా ఎంపీ

గత ఏడాది కాలం నుంచి పెరుగుతున్న పెట్రోల్ ధరలు... తొలిసారి బుధవారం తగ్గుముఖం పట్టాయి. లీటర్ పెట్రోల్​పై 18 పైసలు, డీజిల్​పై 17 పైసలు తగ్గిస్తూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. 2020 మార్చి 16 తర్వాత తొలిసారి ఇంధన ధరలు తగ్గింది ఇప్పుడే.

ఇదీ చదవండి: శుభవార్త: తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.