ETV Bharat / bharat

ఉపాధ్యాయుడికి బెత్తం ఇచ్చి మరీ కొట్టించుకున్న విద్యార్థులు - గురుపూజోత్సవం

గురుపూజోత్సవం రోజు తమ ప్రియతమ ఉపాధ్యాయుడిని కలిసి సరదాగా బెత్తంతో కొట్టించుకున్నారు పూర్వ విద్యార్థులు. చిన్ననాటి రోజులను గుర్తు చేసుకుని సంతోషంలో మునిగిపోయారు.

Different Teacher's day: For alumni, The cane stick beaten and greeted from the head Master
గురుపూజోత్సవం రోజు పూర్వ విద్యార్థులకు హెడ్​మాస్టర్​ దండన
author img

By

Published : Sep 6, 2021, 12:27 PM IST

మధురై పాఠశాలలో భిన్నంగా గురుపూజోత్సవం

ఓనమాలు నేర్పించి తమ జీవితాలను తీర్చిదిద్దిన మాస్టారుతో గురుపూజోత్సవం రోజు సరదాగా గడిపారు తమిళనాడు మధురైలోని ఓ పాఠశాల పూర్వ విద్యార్థులు. 40 ఏళ్లుగా పాఠాలు చెబుతున్న తమ ప్రియతమ ఉపాధ్యాయునికి శాలువా కప్పి సన్మానం చేశారు. ఆయనకు బెత్తం ఇచ్చి ఓసారి కొట్టమని బతిమిలాడారు. విద్యార్థుల విజ్ఞప్తిని మన్నించి మాస్టారు కూడా సరదాగా చేతిపై తలో దెబ్బ కొట్టారు. దీంతో చిన్ననాటి రోజులను గుర్తు చేసుకుని అందరూ ఆనందంలో మునిగిపోయారు.

Different Teacher's day: For alumni, The cane stick beaten and greeted from the head Master
గురుపూజోత్సవం రోజు పూర్వ విద్యార్థులతో హెడ్​మాస్టర్​

మధురై సెల్లూర్​లోని మనోహర మిడిల్​ స్కూల్లోనే వీరంతా చదువుకున్నారు. ఈ ప్రభుత్వ అనుంబంధ పాఠశాలలో పాల్​ జయశంకర్​ అనే ఉపాధ్యాయుడు 40 ఏళ్లుగా బోధిస్తున్నారు. ప్రస్తుతం ఆయనే దీనికి హెడ్​మాస్టర్​. గురుపూజోత్సవం రోజు కలిసిన పూర్వ విద్యార్థుల ఆప్యాయత చూసి ఆయన మురిసిపోయారు. ఇన్నేళ్ల తర్వాత పిల్లలు మళ్లీ కలవడంపై సంతోషం వ్యక్తం చేశారు.

హెడ్​మాస్టర్​కు జ్ఞాపిక అందిస్తున్న పూర్వవిద్యార్థులు

చిన్నప్పుడు స్కూల్​లో టీచర్లు కొడితే నొప్పిగా ఉండేదని, కానీ క్రమశిక్షణగా ఉండాలని వారు కఠినంగా వ్యవహరించడం వల్లే తాము బాగా చదువుకొని జీవితంలో స్థిరపడినట్లు ఓ పూర్వ విద్యార్థి తెలిపాడు.

Different Teacher's day: For alumni, The cane stick beaten and greeted from the head Master
గురుపూజోత్సవం రోజు పూర్వ విద్యార్థులకు హెడ్​మాస్టర్​ దండన

"మాస్టారు కోసం వెదురు కర్ర తెచ్చి కొట్టించుకోవడం సరదాగా, సంతోషంగా ఉంది. వారు కఠినంగా ఉండటం వల్లే మేం ఈరోజు సమాజంలో గౌరవమైన హోదాలో ఉన్నాం. ఈ సందేశమిచ్చేందుకే ఇలా చేశాం" అని పూర్వ విద్యార్థి తెలిపాడు.

ఒకప్పుడు స్కూల్స్​లో టీచర్లు విద్యార్థులు తప్పు చేస్తే కొట్టేందుకు వెదురు కర్రలను ఉపయోగించేవారు. ఆ సమయంలో తమ దుకాణం బాగా నడిచిందని, కానీ ఈ రోజుల్లో పాఠశాలల్లో బెత్తం వాడకపోవడం వల్ల ఎవరూ దుకాణానికి రావడం లేదని మధురై సమీపంలోని ఓ షాపు యజమాని చెప్పాడు.

ఇదీ చదవండి: ముక్కోణపు ప్రేమ.. లాటరీలో వరుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.