కేరళ కోజికోడ్ సౌత్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న నూర్బినా రషీద్... అరుదైన గుర్తింపు దక్కించుకున్నారు. కేరళలోని యూడీఎఫ్లోని భాగస్వామ్యపక్షమైన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్ ) తరఫున గత 25 ఏళ్లలో పోటీ చేస్తున్న మహిళగా నిలిచారు. చివరిసారిగా 1996లో ఐయూఎంఎల్ తరఫున ఖామరున్నీసా పోటీ చేశారు.
" 25ఏళ్ల తరువాత ఈ సారి పార్టీ.. మహిళా అభ్యర్థులకు అవకాశం ఇస్తుందని నేను ఆశించాను. పార్టీ తీసుకున్న నిర్ణయం పట్ల నాకు చాలా ఆనందంగా ఉంది. ఎన్నికల్లో గెలిస్తే కేరళలో మహిళల భద్రతే లక్ష్యంగా పనిచేస్తాను. సమాజానికి సేవ చేస్తాను. ప్రజాస్వామ్యాన్ని కాపాడతా."
-- నూర్బినా రషీద్, ఐయూఎంఎల్ కోజికోడ్ అభ్యర్థి
'ప్రజల కోరిక అదే'
అసెంబ్లీలోకి మరింత మంది మహిళలు రావాలని ప్రజలు కోరుకుంటున్నట్లు నూర్బినా తెలిపారు. మహిళల సమస్యలు, అణగారిన వర్గాల బాధలను మహిళలు.. ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లగలరని ప్రజలు భావిస్తున్నారని వివరించారు.
ఐయూఎంఎల్ ఈ సారి 27 స్థానాల్లో బరిలోకి దిగుతోంది.
కేరళలోని మొత్తం 140 స్థానాల్లో ఏప్రిల్ 6న ఎన్నికలు జరగనున్నాయి. మే 2న ఫలితాలు వెల్లడిస్తారు.
ఇదీ చదవండి: 'కాంగ్రెస్, భాజపా వల్లే చమురు ధరల మంట'