వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా అందరూ టీకా తీసుకునేలా ప్రోత్సహించేందుకు ఉత్తర్‌ప్రదేశ్ ఫిరోజాబాద్ అధికార యంత్రాంగం సరికొత్త నిర్ణయం తీసుకుంది. టీకా వేయించుకుంటేనే నెల జీతం ఇవ్వనున్నట్లు జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులకు తెలిపింది.
ఈ మేరకు జిల్లా కలెక్టర్ చంద్ర విజయ్ సింగ్.. 'నో వ్యాక్సిన్ నో శాలరీ' అని ఆదేశించారని చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్ చర్చిత్ గౌర్ స్పష్టం చేశారు. టీకా తీసుకోని ఉద్యోగులకు మే నెల జీతం ఆపేయనున్నట్లు తెలిపారు. సాలరీ ఆగిపోతుందనే భయంతో ఉద్యోగులు టీకా తీసుకునేందుకు ముందుకొస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి:విదేశీ టీకాల రాకకు డీసీజీఐ లైన్‌క్లియర్..!