తూర్పు లద్దాఖ్‌లో సరిహద్దు (India China border) సమస్యపై భారత్, చైనా సైనికాధికారులు నిర్వహించిన 13వ విడత సమావేశంలో (India China talks) పరిష్కారం దిశగా ఎలాంటి ముందడుగు పడలేదు. ప్రతిష్టంభనకు (India China standoff) తెరదించేలా ఫలితాలేవీ రాలేదని భారత సైన్యం అధికారికంగా వెల్లడించింది. (India China latest news)
గల్వాన్ లోయలో బలగాల ఉపసంహరణ ఇప్పటికే పూర్తి కాగా.. మిగిలిన ప్రదేశాల్లో సమస్య పరిష్కారం కోసం భారత్ నిర్మాణాత్మక సూచనలు చేసిందని ఆర్మీ పేర్కొంది. అయితే, వీటిని చైనా అంగీకరించలేదని తెలిపింది. అంతేగాక, సమస్య పరిష్కారం దిశగా చైనా సైనికాధికారులు ఎలాంటి ప్రతిపాదనలు చేయలేదని వెల్లడించింది. (India China talks)
"మిగిలిన ప్రాంతాల్లో సమస్య పరిష్కారంపై సమావేశం ఫలితాన్ని ఇవ్వలేదు. వాస్తవాధీన రేఖ వెంబడి పరిస్థితికి కారణం చైనానే అని భారత్ వారితో స్పష్టం చేసింది. ద్వైపాక్షిక ఒప్పందాలు, యథాతథ స్థితిని ఉల్లంఘించి చైనా ఏకపక్షంగా చేసిన చర్యలే ఇందుకు కారణమని చైనాకు వివరించింది. కాబట్టి, మిగిలిన ప్రాంతాల్లో పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకొచ్చేలా చైనా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చర్చల్లో పాల్గొన్న భారత బృందం చైనాకు సూచించింది. ఇలా చేస్తే ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతి ఉంటుందని స్పష్టం చేసింది."
-భారత సైన్యం ప్రకటన
అయితే, ఇరుపక్షాలు సమస్యపై సంప్రదింపులు కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు భారత సైన్యం తెలిపింది. క్షేత్రస్థాయిలో స్థిరత్వం నెలకొనేలా చూడాలని అంగీకరించుకున్నట్లు వెల్లడించింది. ద్వైపాక్షిక సంబంధాలను దృష్టిలో పెట్టుకొని నిబంధనలకు అనుగుణంగా సమస్య పరిష్కారానికి చైనా కృషి చేస్తుందని భావిస్తున్నట్లు పేర్కొంది.
ఈ సమావేశంపై చైనా ఆర్మీ సైతం ప్రకటన జారీ చేసింది. అసంబద్ధమైన, అవాస్తవికతతో కూడిన డిమాండ్లతో పరిష్కారం కోసం చేస్తున్న చర్చలను భారత్ మరింత క్లిష్టతరం చేస్తోందని చైనా పేర్కొంది. పరిస్థితులను తప్పుగా అంచనా వేయొద్దని చెప్పుకొచ్చింది.
ఎనిమిదిన్నర గంటల చర్చలు
ఇటీవల చైనా సైన్యం చొరబాటు ఘటనలు వెలుగు చూసిన నేపథ్యంలో ఇరుదేశాల మధ్య 13 విడత సైనిక చర్చలు జరిగాయి. చైనా వైపున ఉన్న చుషూల్ మోల్డో సరిహద్దు వద్ద ఆదివారం ఉదయం పదిన్నరకు ప్రారంభమైన సమావేశం రాత్రి ఏడు గంటల వరకూ కొనసాగింది. సుమారు ఎనిమిదిన్నర గంటల పాటు జరిగిన చర్చల్లో అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. పెట్రోలింగ్ పాయింట్ 15 వద్ద నుంచి బలగాల ఉపసంహరణను పూర్తిచేయడమే ప్రధాన అజెండాగా చర్చించినట్లు సమాచారం.
వాస్తవాధీన రేఖ వెంబడి ప్రతిష్టంభనను సత్వరమే పరిష్కరించుకోవాలని భారత సైన్యం భావిస్తోంది. దెస్పంగ్, దెమ్చోక్ ప్రాంతాల్లోనూ ప్రతిష్టంభనకు తెరదించాలని అనుకుంటోంది. ఇరుదేశాల మధ్య సంబంధాలు మెరుగు పడాలంటే దెప్సాంగ్ సహా అన్ని ఫ్రిక్షన్ పాయింట్ల వద్ద నుంచి బలగాల ఉపసంహరణ (Eastern Ladakh Standoff) అవసరమని భారత్.. చైనాకు స్పష్టం చేస్తోంది.
ఇదీ చదవండి: