ETV Bharat / bharat

'కశ్మీరీల బాధను మాటల్లో చెప్పలేం'

author img

By

Published : Aug 5, 2021, 1:17 PM IST

ఆర్టికల్ 370 రద్దు, జమ్ముకశ్మీర్​ విభజన చేస్తూ కేంద్రం సంచలనాత్మక నిర్ణయం తీసుకొని నేటికి రెండేళ్లు. ఈ అంశంపై మాట్లాడిన పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆ బాధ మాటల్లో చెప్పలేమని ట్వీట్​ చేశారు.

article 370, jammu kashmir
ఆర్టికల్ 370, జమ్ముకశ్మీర్

జమ్ముకశ్మీర్​కు ప్రత్యేక హోదా తొలగించి నేటితో రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జమ్ముకశ్మీర్​ మాజీ సీఎం, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ విచారం వ్యక్తం చేశారు. అన్యాయాన్ని చూస్తూ.. పరిస్థితుల్లో అణిగిమణిగి ఉండటం తప్ప ప్రజలకు వేరే దారి లేకుండా చేశారని ట్వీట్​ చేశారు.

  • No words or pictures are enough to depict the pain, torment & upheaval inflicted upon J&K on this black day two years ago. When unbridled oppression is unleashed & gross injustice heaped there is no other choice but to resist to exist. pic.twitter.com/xjVW3By6cl

    — Mehbooba Mufti (@MehboobaMufti) August 5, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"రెండు సంవత్సరాల క్రితం ఈరోజు చేసిన ప్రకటన వల్ల జమ్ముకశ్మీర్​ ప్రజలు ఎంతలా బాధపడ్డారో మాటల్లో చెప్పలేను. వారు అనుభవించిన బాధను ఫొటోలు చూసి వర్ణించలేం. అన్యాయం, తీవ్ర ఒత్తిడి నడుమ అణిగి ఉండటం తప్ప ప్రజలకు ఇంకో దారి లేకుండా చేశారు."

--మెహబూబా ముఫ్తీ, పీడీపీ అధ్యక్షురాలు.

చీకటి రోజు..

'జమ్ముకశ్మీర్​ చరిత్రలో ఆగస్టు 5 ఓ చీకటిరోజుగానే మిగిలిపోతుంది. ఈ నిర్ణయం జమ్ముప్రజలను రాజకీయంగా, మానసికంగా దెబ్బతీసింది' అని పీపుల్స్ కాన్ఫరెన్స్ పార్టీ నేత ఖుర్షీద్ ఆలమ్ అన్నారు.

గుప్కార్ కూటమి భేటీ..

జమ్ముకశ్మీర్​ రాష్ట్ర హోదా తొలగించి రెండేళ్లయిన నేపథ్యంలో పీపుల్ అలియన్స్​ ఫర్ గుప్కార్ డిక్లరేషన్(పీఏజీడీ) సభ్యులు భేటీ అయ్యారు. నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా నివాసం వద్ద సమావేశమై.. జమ్ముకశ్మీర్​లోని ప్రస్తుత పరిస్థితులపై చర్చించినట్లు నేతలు పేర్కొన్నారు.

ఈ భేటీకి పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ, సీపీఎం నేత ఎం వై తరిగామి, అవామి నేషనల్ కాన్ఫరెన్స్ నేత ముజఫర్ షా సహా, ఇతర నేతలు హాజరయ్యారు.

2019 ఆగస్టు 5న ఆర్టికల్​ 370 రద్దు, జమ్ముకశ్మీర్​ విభజన నిర్ణయం తీసుకుంది కేంద్రం. జమ్ముకశ్మీర్​ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజిస్తున్నట్లు వెల్లడించింది.

కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని మొదటి నుంచే విమర్శిస్తున్నారు జమ్ముకశ్మీర్​లోని పలువురు నేతలు.

ఇదీ చదవండి:

భూతల స్వర్గంలో 'శాంతి' కలవరం!

ఆర్టికల్​ 370 రద్దుకు ఏడాది- లోయలో మార్పులెన్ని?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.