ETV Bharat / bharat

'సాగు చట్టాల వల్ల ఏం నష్టం జరిగింది?' - Rahul Gandhi

వ్యవసాయ చట్టాలను రైతుల సంక్షేమం కోసమే తీసుకొచ్చినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రైతు సంఘాల నేతలతో అనేక సార్లు చర్చలు జరిపామని తెలిపారు. అయితే వారి డిమాండ్లు ఏమిటో అర్థం కావడం లేదని చెప్పుకొచ్చారు. సాగు చట్టాల వల్ల రైతులకు ఎక్కడైనా మద్దతుధర దక్కలేదా? అని ప్రశ్నించారు.

LS LIVE: PM Modi replies to President's address in House
'సాగు చట్టాల వల్ల ఏం నష్టం జరిగింది?'
author img

By

Published : Feb 10, 2021, 5:07 PM IST

వ్యవసాయ రంగం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రాష్ట్రపతి ప్రసంగ ధన్యవాద తీర్మానంపై లోక్​సభలో మాట్లాడిన ఆయన.. రైతులకు కనీస మద్దతు ధర అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.

సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలో రైతులు ఆందోళన చేస్తున్నారని, అయితే అన్నదాతల డిమాండ్లు ఏమిటో అర్థం కావడం లేదని అన్నారు మోదీ. రైతు సంఘాల నేతలతో అనేక సార్లు చర్చలు జరిపామని తెలిపారు. వ్యవసాయ చట్టాలు రైతుల సంక్షేమం కోసమే తీసుకొచ్చినట్లు వివరించారు. రైతులకు ఈ చట్టాలు ఇబ్బందిగా ఉంటే వాటిపై తప్పనిసరిగా దృష్టిసారిస్తామని హామీ ఇచ్చారు. సాగు చట్టాల వల్ల ఏం నష్టం జరిగిందంటూ ఎదురు ప్రశ్నించారు మోదీ.

"సాగు చట్టాలతో దేశంలో ఎక్కడైనా వ్యవసాయ మార్కెట్లు మూతబడ్డాయా? సాగు చట్టాల వల్ల రైతులకు ఎక్కడైనా మద్దతు ధర దక్కలేదా? కొత్త సాగు చట్టాలతో ఒక్క రైతుకూ నష్టం జరగదు. రైతులకు నష్టం కలిగించే చట్టాలు ఎందుకు చేస్తాం?"

-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

ప్రసంగాన్ని అడ్డుకునేందుకు ఓ ఎంపీ ప్రయత్నించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు మోదీ. కావాలనే కొందరు తన ప్రసంగాన్ని అడ్డుకుంటున్నారని, ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయని కొందరు భయపడుతున్నారని అన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.