సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షల నిర్వహణపై ఆ బోర్డు స్పష్టతనిచ్చింది. పరీక్షణ నిర్వహణపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపింది. ఎటవంటి నిర్ణయం తీసుకున్నా అధికారికంగా ప్రకటిస్తామని బోర్డు సీనియర్ అధికారి తెలిపారు. పరీక్షణ నిర్వహణపై మీడియాలో వస్తున్న కథనాల్లో వాస్తవాలు లేవని స్పష్టం చేశారు.
జూన్ 1 తరువాత పరిస్థితిపై సమీక్ష నిర్వహిస్తామన్నారు. పరీక్షలకు కనీసం 15 రోజుల ముందు విద్యార్థులకు తెలియజేస్తామని వివరించారు.
సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలు ఏటా ఫిబ్రవరి, మార్చిలో నిర్వహిస్తారు. మొదట మే 4 పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినా.. కొవిడ్ రెండో దశ దృష్ట్యా 10వ తరగతి పరీక్షలు రద్దు చేయగా.. 12వ తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి.
ఇదీ చదవండి : దృఢ సంకల్పంతో కరోనాను జయించిన కుటుంబం