ప్రజలంతా కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడమే లక్ష్యంగా మహారాష్ట్రలోని ఠాణె మున్సిపల్ కార్పొరేషన్(టీఎంసీ)(Thane municipal corporation) మరో కఠిన నిర్ణయం తీసుకుంది. కొవిడ్ టీకా కనీసం ఒక్క డోసు కూడా తీసుకోని వారిని ప్రభుత్వ బస్సులో ప్రయాణించేందుకు అనుమతించబోమని తెలిపింది. ఈ మేరకు టీఎంసీ(Thane municipal corporation) మేయర్ నరేశ్ మఖ్సే శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు.
"నవంబర్ చివరినాటికి 100శాతం టీకా అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అది నెరవేరేందుకు తగిన నిర్ణయాలు తీసుకోవడం తప్పనిసరి. టీఎంసీ పరిధిలో వ్యాక్సిన్ తీసుకోనివారు కనిపిస్తే సమీపంలోని కేంద్రంలో వారికి తక్షణమే టీకా వేస్తాం. ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణించే వారు కచ్చితంగా తాము వ్యాక్సిన్ తీసుకున్నట్లుగా ధ్రువపత్రాన్ని చూపించాలి. లేదంటే.. వారిని బస్సులో ప్రయాణించేందుకు అనుమతించం."
-ఠాణె మున్సిపల్ కార్పొరేషన్.
టీకా తీసుకోని తమ సిబ్బందికి జీతాలు చెల్లించబోమని ప్రకటించిన కొద్దిరోజులకే.. తాజాగా బస్సు ప్రయాణాలపై ఆంక్షలు విధించింది టీఎంసీ.
శుక్రవారం వరకు ఠాణెలో 86,00,118 మందికి టీకా అందించారు. అందులో మొదటి డోసు తీసుకున్నవారు 56,00,856 మంది కాగా.. 29,99,262 మంది రెండు డోసులు తీసుకున్నారు.
ఇదీ చూడండి: covid regulations: కొవిడ్ నిబంధనలకు అడుగడుగునా తూట్లు
ఇదీ చూడండి: దేశంలో 80 శాతం మందికి మొదటి డోసు పూర్తి