ETV Bharat / bharat

కొవిడ్​ రిపోర్టు లేక గుడి నుంచి వెనుదిరిగిన గవర్నర్​ - ganeshi lal news

ఒడిశా గవర్నర్​ గణేశీ లాల్​కు పూరీ జగన్నాథుని సన్నిధిలో అనూహ్య అనుభవం ఎదురైంది. కొవిడ్​ రిపోర్టు సమర్పించని కారణంగా ఆలయం నుంచి వెనుదిరగాల్సి వచ్చింది.

No Covid report, Odisha governor turns back from Jagannath Temple
కొవిడ్​ రిపోర్టు లేక ఆలయం నుంచి వెనుదిరిగిన గవర్నర్​
author img

By

Published : Jan 4, 2021, 1:14 PM IST

పూరీ జగన్నాథుడిని దర్శించుకునేందుకు వచ్చిన ఒడిశా గవర్నర్ గణేశీ లాల్​కు చేదు అనుభవం ఎదురైంది. కరోనా నెగటివ్​ రిపోర్టు సమర్పించని కారణంగా గుడి లోపలకు వెళ్లకుండానే వెనుదిరిగాల్సి వచ్చింది. ఆలయం సింహ ద్వారం నుంచే స్వామి దర్శనం చేసుకుని తిరిగి రాజ్​భవన్​కు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు.

అడ్డగించారా?

కొవిడ్​ వల్ల మూతపడిన ఆలయం ఇటీవలే తిరిగి తెరుచుకుంది. దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా కరోనా రిపోర్ట్​ సమర్పించాల్సి ఉంటుందని అధికారులు షరతు విధించారు. అయితే టెస్టు చేయించుకోకుండానే గవర్నర్​ ఆలయానికి వచ్చారు. రిపోర్టు లేదని గవర్నర్​ను ఎవరైనా అడ్డుకున్నారా అని ప్రశ్నించగా... అధికారులు అలాంటిదేం లేదని సమాధానమిచ్చారు. గణేశీ లాల్​ నిబంధనలను గౌరవిస్తూ, తనంతట తాను వెనుదిరిగారని స్పష్టంచేశారు.

ఇదీ చూడండి: 9 నెలల తర్వాత భక్తులకు 'పూరీ' దర్శనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.