ETV Bharat / bharat

ఆ రాష్ట్రంలో ఎన్నికలున్నా ఫ్లెక్సీలు లేవు.. ఎందుకంటే? - no banners in election campaign

సాధారణంగా ఎన్నికల ప్రచారం అంటే ఇల్లిల్లూ తిరగడం, మైకులు, ప్రచార రథాలు, సభలు, సమావేశాలు ఉంటాయి. వీటికి తోడు బ్యానర్లు, ఫ్లెక్సీలు, పోస్టర్‌లు సరేసరే. శాసనసభ ఎన్నికలు జరగనున్న అయిదు రాష్ట్రాల్లోని ఒక రాష్ట్రంలో మాత్రం బ్యానర్లు, ఫ్లెక్సీలు, పోస్టర్‌లు, జెండాల పాత్ర మాత్రం చాలా తక్కువే కనిపిస్తోంది. పార్టీలు వీటి పేరు చెబితేనే వణికిపోతున్నారు. మరి అలా జరుగుతుంది ఏ రాష్ట్రంలో, పార్టీలకు అవంటే ఎందుకు భయం?

No Banners in election campaigns in tamilnadu
ఆ రాష్ట్రంలో ఎన్నికలున్నా ఫ్లెక్సీలు లేవు.. ఎందుకంటే?
author img

By

Published : Mar 21, 2021, 8:18 AM IST

విలక్షణ రాజకీయాలకు పెట్టింది పేరు తమిళనాడు. అక్కడ ఏప్రిల్‌ 6న జరగనున్న శాసనసభ ఎన్నికల ప్రచారం కూడా కాసింత విలక్షణంగానే జరుగుతోంది. ప్రచారంలో సాధారణంగా కనిపించే ఫ్లెక్సీలు, బ్యానర్లు, పోస్టర్‌లు, జెండాలను తక్కువగా వినియోగిస్తూ తమిళనాడులో రాజకీయ పార్టీల ప్రచారం సాగుతోంది. అభ్యర్ధులు ఒక వేళ అవి కావాలనుకున్నా ప్రచారానికి కొద్ది సేపు ముందు మాత్రమే వాటిని ఏర్పాటు చేసి, ప్రచారం ముగిసిన వెంటనే వాటిని తొలగిస్తున్నాయి రాజకీయ పార్టీలు.

కోర్టు తీర్పు వల్లే..

తమిళనాడులోని అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్ధితి కనిపిస్తోంది. ప్రధాన రహదారుల నుంచి చిన్నవీధుల వరకు అంతటా ఇదే స్థితి. అన్ని రాజకీయ పార్టీల ధోరణి కూడా అదే. ఏ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కనిపించే వాతావరణానికి ప్రస్తుతం తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో కనిపిస్తున్న వాతావరణం పూర్తిగా భిన్నంగా ఉంది. దీనికి ప్రధాన కారణం ఎన్నికల నియమావళి, గతంలో మద్రాస్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పే.

ఇదీ చూడండి: కమల్​ మేనిఫెస్టో: వారికి నెలకు 15వేలు ఆదాయం!

హైకోర్టు అసహనం..

రహదారులను ఆక్రమించి పార్టీలు బ్యానర్లు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నాయని, దీని వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని దాఖలైన పిటిషన్‌లపై గతంలో హైకోర్టు విచారణ జరిపింది. దీనిపై చర్యలు తీసుకోవాలని పలు సందర్భాల్లో న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చినా అధికారులు పట్టించుకోలేదు. 2018 డిసెంబర్‌లో ఫెక్సీలు, బ్యానర్లపై ఆదేశాలు జారీ చేసిన మద్రాస్‌ హైకోర్టు.. అధికార యంత్రాంగంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వాటిని తొలగించడంలో విఫలమైన అధికారులు, ఉద్యోగాలు వదులుకుని రాజకీయ పార్టీల్లో చేరాలని వ్యాఖ్యానించింది. రాజకీయ పార్టీల వైఖరి కూడా సరిగా లేదని వ్యాఖ్యలు చేసింది.

ఇదీ చూడండి: తమిళ బరిలో తెలుగు వెలుగులు!

ఫ్లెక్సీలతో ప్రమాదాలు..

ఆ తర్వాత 2019 సెప్టెంబర్‌లో చెన్నై శివారులో శుభశ్రీ అనే యువతి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ఫ్లెక్సీ ఊడి ఆమెపై పడగా ఆ యువతి కింద పడిపోయింది. అదే సమయంలో లారీ ఆమెను ఢీ కొట్టడం వల్ల ప్రాణాలు కోల్పోయింది. ఆ సంవత్సరమే కోవైలో రాజేశ్వరి అనే మహిళపై జెండా స్తంభం పడింది. కిందపడిన ఆమెను లారీ ఢీ కొని కాలును కోల్పోయింది. ఈ నేపథ్యంలో బ్యానర్లు, ఫ్లెక్సీల ఏర్పాటుకు అధికారులు అనుమతి ఇవ్వకుండా చూడాలని మద్రాస్‌ హైకోర్టులో మరో పిటిషన్‌ దాఖలైంది. దీనిపై తీర్పు వెలువరించిన హైకోర్టు బ్యానర్లు, ఫ్లెక్సీల ఏర్పాటుకు అనుమతి నిబంధనలు కఠినతరం చేసింది. వీటిని ఉల్లంఘిస్తే అవి ఏర్పాటు చేసిన నేతలపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. రాజకీయ పార్టీలు కూడా వాటికి స్వచ్ఛందంగా స్వస్తి పలకాలని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: తమిళ సీఎం అభ్యర్థుల ఆస్తుల లెక్కలు తెలుసా?

మార్పు మంచికే..

ఈ నేపథ్యంలోనే తమిళనాడు శాసనసభ ఎన్నికల ప్రచారంలో బ్యానర్లు, ఫ్లెక్సీలు, పోస్టర్‌లను పార్టీలు తక్కువగా వినియోగిస్తున్నాయి. అవి కూడా నిబంధనలు పాటిస్తూ ఏర్పాటు చేస్తున్నాయి. వాటికి ప్రత్యామ్నాయ పద్ధతులను అనుసరిస్తున్నాయి. అభ్యర్ధి కొత్త వారైతే ప్రతి వీధిలో ఓ చురుకైన వ్యక్తిని ఎంపిక చేసి అతని ద్వారా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ద్విచక్ర వాహనాలకు పార్టీల జెండాలను కట్టి ప్రచారం చేస్తున్నారు. చిన్న చిన్న కరపత్రాలపై అభ్యర్ధుల ఫోటోను ముద్రించి ఓటర్లకు పంచుతున్నారు. రాజకీయ పార్టీల్లో వచ్చిన ఈ మార్పును చూసి తమిళనాడు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పద్ధతి ఎప్పటికీ కొనసాగాలని కోరుకుంటున్నారు.

ఇదీ చూడండి: 'తమిళవాదం'పై డీఎంకే, అన్నాడీఎంకే ఏకస్వరం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.