ETV Bharat / bharat

బలహీన పడిన 'నివర్'‌- ముమ్మరంగా సహాయక చర్యలు - నివర్​ బీభత్సం

పుదుచ్చేరి సమీపంలో బుధవారం అర్ధరాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 2.30 గంటల మధ్యలో ‘నివర్’ తీరం దాటినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. తుపాను ధాటికి తమిళనాడులోని చెన్నై సహా కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. ఇవాళ తమిళనాడులోని 16 జిల్లాల్లో ప్రభుత్వం సెలవుదినంగా ప్రకటించింది. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని విజ్ఞప్తి చేసింది.

Nivar-turned-into-a-severe-storm
బలహీన పడిన 'నివర్'‌.. ముమ్మరంగా సహాయక చర్యలు
author img

By

Published : Nov 26, 2020, 10:17 AM IST

అతి తీవ్ర తుపాన్‌ నివర్‌ తీవ్రత క్రమంగా తగ్గుతోంది. తీరం దాటిన తర్వాత తీవ్ర తుపానుగా మారింది. పుదుచ్చేరి సమీపంలో బుధవారం అర్ధరాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 2.30 గంటల మధ్యలో ‘నివర్’ తీరం దాటినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. తీరం దాటే సమయంలో 120 నుంచి 145 కి.మీ వేగంతో పెనుగాలులు వీయగా.. తర్వాత కూడా కొద్ది గంటలపాటు ప్రభావం కొనసాగింది. తుపాను ధాటికి తమిళనాడులోని చెన్నై సహా కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి.

బుధవారం నుంచే పుదుచ్చేరి, తమిళనాడు తీరప్రాంతాల్లో పెనుగాలులు, అతిభారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. గాలులకు భారీ చెట్లుకూడా నేలకొరిగాయి.అనేక చోట్ల విద్యుత్‌ స్తంబాలు కూడా పడిపోయాయి. దీంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. తమిళనాడులో ముందు జాగ్రత్తగా నాగపట్నం, విల్లుపురం, కడలూరు జిల్లాలతో పాటు మరిన్ని ప్రాంతాల నుంచి 1.45 లక్షల మందిని 1500పైగా పునరావాస శిబిరాలు ఏర్పాటు చేసి తరలించారు. చెన్నై, చెంగల్‌పేట, కడలూరుతోపాటు పుదుచ్చేరిలో నిన్న భారీ వర్షాలు కురిశాయి. చెన్నైలో బుధవారం 16సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పుదుచ్చేరిలో 10 సెంటీమీటర్లు కురిసింది. ఇవాళ తమిళనాడులోని 16 జిల్లాల్లో ప్రభుత్వం సెలవుదినంగా ప్రకటించింది. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

ముమ్మరంగా సహాయక చర్యలు

తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాల్లోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విపత్తు నిర్వహణ సిబ్బంది సహాయక చర్యలు ముమ్మరం చేశారు. 1200 వందల బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ఒడిశాలో మరో 20 బృందాలను సిద్ధంగా ఉంచారు. నౌకాదళం కూడా సహాయక చర్యల్లో పాల్గొంటోంది. చెన్నై తీరంలో కోస్టుగార్డులతోపాటు షిప్‌లను, హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచారు. పుదుచ్చేరి సర్కారు విజ్ఞప్తితో సైన్యం కూడా రంగంలోకి దిగింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.