ETV Bharat / bharat

బిహార్​లో 'ఫ్రంట్​లైన్​ వర్కర్స్​'గా పాత్రికేయులు - నితీశ్​ ప్రభుత్వం

కొవిడ్​ విజృంభణ వేళ.. పాత్రికేయులకు భరోసాగా బిహార్​ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారిని 'ఫ్రంట్​లైన్​ వర్కర్స్​' గుర్తిస్తున్నట్లు తెలిపింది. ప్రాధాన్య క్రమంలో కొవిడ్​ టీకా అందజేస్తామని చెప్పింది.

nitish kumar, bihar cm
బిహార్​లో 'ఫ్రంట్​లైన్​ వర్కర్స్​'గా పాత్రికేయులు
author img

By

Published : May 2, 2021, 10:48 PM IST

బిహార్​లోని పాత్రికేయులకు ఫ్రంట్​ లైన్​ వర్కర్స్​ హోదా కల్పిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్​ నిర్ణయం తీసుకున్నారు. వారికి ప్రాధాన్య క్రమంలో టీకా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.

రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖతో గుర్తింపు పొందిన విలేకరులతో పాటు.. జిల్లా పౌర సంబంధాల అధికారుల గుర్తింపు పొందిన వారికి కూడా కరోనా యోధులుగా పరిగణిస్తామని బిహార్​ ప్రభుత్వం తెలిపింది. ప్రింట్​, ఎలక్ట్రానిక్​, వెబ్​ మీడియాలో ఉన్న పాత్రికేయులకు టీకా అందజేస్తామని పేర్కొంది.

కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రజలను అప్రమత్తం చేయటంలో విలేకరులు కీలక పాత్ర పోషిస్తున్నారని బిహార్​ ప్రభుత్వం పేర్కొంది. ప్రమాదం పొంచి ఉన్నప్పటికీ విలేకరులు తమ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారని ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్ అనేక సందర్భాల్లో కొనియాడారు.

ఇదీ చూడండి: కోయంబత్తూరు​లో కమల్ హాసన్​ ఓటమి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.