ETV Bharat / bharat

ప్రభుత్వం సకాలంలో నిర్ణయాలు తీసుకోవట్లేదని గడ్కరీ విమర్శలు - ప్రభుత్వంపై నితిన్​ గడ్కరీ వ్యాఖ్యలు

Nitin Gadkari News ఇటీవల భాజపా పార్లమెంటరీ కమిటీలో చోటు కోల్పోయిన కేంద్ర మంత్రి నితిన్​ గడ్కరీ ప్రభుత్వంపై సునిశిత విమర్శలు చేశారు. ప్రభుత్వం సకాలంలో నిర్ణయాలు తీసుకోకపోవడమే అతి పెద్ద సమస్య అన్నారు. ఈ వ్యాఖ్యలపై కొందరు భాజపా నేతలు కూడా స్పందించారు.

Nitin Gadkari News The Government is Not Taking Decisions in Time and Thats a Problem

author img

By

Published : Aug 24, 2022, 7:37 AM IST

Nitin Gadkari News: ప్రభుత్వం సకాలంలో నిర్ణయాలు తీసుకోకపోవడమే ప్రస్తుతమున్న సమస్య అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ. ఇటీవలే భాజపా పార్లమెంటరీ బోర్డులో స్థానం కోల్పోయిన గడ్కరీ నుంచి ఈ వ్యాఖ్యలు రావడం చర్చనీయాంశమైంది.
'మీకు అద్భుతాలు చేయగల సత్తా ఉంది. భారత మౌలిక సదుపాయాల భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. అందుకోసం మనం సాంకేతికత, కొత్త ఆలోచనలను అందిపుచ్చుకోవాలి. పరిశోధనకు ప్రాధాన్యం ఇవ్వాలి. నాణ్యతతో రాజీపడకుండా ఖర్చు తగ్గించే ప్రత్యామ్నాయ ముడిపదార్థాలను వినియోగించాలి. మొత్తంగా నిర్మాణానికి సమయం అనేది అత్యంత కీలకమైంది. అదే అతి పెద్ద పెట్టుబడి. అయితే ఇక్కడున్న అతి పెద్ద సమస్య.. సకాలంలో ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోకపోవడమే' అంటూ విమర్శనాత్మకంగా స్పందించారు.
ఆదివారం అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ ముంబయిలో ఏర్పాటు చేసిన NATCON-2022 సదస్సులో ఆయన మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలు ప్రత్యేకంగా ఓ ప్రభుత్వాన్ని ఉద్దేశించి కాదని, మొత్తంగా ప్రభుత్వాల పనితీరును ప్రస్తావించారని భాజపా నేతలు అంటున్నారు.

ఇలా సూటిగా మాట్లాడే తత్వమే భాజపా పార్లమెంటరీ కమిటీలో చోటు కోల్పోయేందుకు కారణమైందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ కమిటీలో స్థానం దక్కని మరుక్షణమే.. అటల్ బిహారీ వాజ్‌పేయీ, ఎల్‌కే ఆడ్వాణీని ప్రశంసిస్తూ గడ్కరీ మాట్లాడారు. ఆ అగ్ర నేతల కృషి వల్లే భాజపా కేంద్రంలో పాలనా పగ్గాలు చేపట్టే స్థాయికి ఎదిగిందని పేర్కొన్నారు. 1980లో భాజపా ముంబయిలో నిర్వహించిన సదస్సులో వాజ్‌పేయీ చేసిన ప్రసంగాన్ని గుర్తుచేసుకున్నారు.

'ఏదో ఒకరోజు చీకటి తొలగిపోతుంది. సూర్యుడు బయటికొస్తాడు. కమలం వికసిస్తుంది' అని అటల్‌ జీ ఆ రోజు వ్యాఖ్యానించారన్నారు. 'ఆ సదస్సులో నేను ఉన్నాను. నాడు వాజ్‌పేయీ ప్రసంగాన్ని విన్నవారంతా అలాంటి ఒకరోజు వస్తుందని విశ్వసించారు. అటల్‌, ఆడ్వాణీ, దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ, ఇంకా మరెందరో కార్యకర్తలు విశేషంగా కృషిచేయడం వల్లే మనం ఇప్పుడు మోదీ నాయకత్వంలో అధికారంలో ఉన్నాం' అని గడ్కరీ పేర్కొన్నారు.

ఇవీ చూడండి: 'అధికారం కోసమే రాజకీయాలా?.. వదిలేయాలని అనిపిస్తోంది'

భాజపా అనూహ్య నిర్ణయం, పార్లమెంటరీ బోర్డు నుంచి గడ్కరీ ఔట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.