ETV Bharat / bharat

నిర్మల్‌ నియోజకవర్గంలో ముక్కోణపు పోటీ-అభ్యర్థులకు అంతుపట్టని ఓటరునాడి - మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఎన్నికల ప్రచారం

Nirmal Politics Telangana Assembly Election 2023 : ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని నిర్మల్‌ నియోజకవర్గం.. ప్రజా చైతన్య కేంద్రంగా ప్రసిద్ధి పొందింది. ఎత్తులకు, పైఎత్తులు వేసే నేతలకు కొదవలేదు. ఈసారి ఓటర్ల నాడి తెలుసుకోవడం కష్టంగా ఉంది. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య ముక్కోణపు పోటీలో ఎవరు గెలుస్తారనే అంశం ఉత్కంఠ రేకెత్తిస్తోంది.

Main Parties Election Campaign in Nirmal
Nirmal Politics Telangana Assembly Election 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 20, 2023, 6:34 AM IST

నిర్మల్‌ నియోజకవర్గంలో ముక్కోణపు పోటీ-అభ్యర్థులకు అంతుపట్టని ఓటరునాడి

Nirmal Politics Telangana Assembly Election 2023 : నిర్మల్‌ నియోజకవర్గంలో 2.47లక్షలకుపైగా ఓటర్లు ఉన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. గతానికంటే భిన్నంగా పరిస్థితి ఉంది. ఈ దఫా ఓటరునాడీ(Electoral Idea) తెలుసుకోవడం నేతలకు కష్టంగానే కనిపిస్తోంది. గులాబీ పార్టీ అభ్యర్థిగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, కమలం పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, హస్తం అభ్యర్థిగా సీనియర్‌ నేత కూచాడి శ్రీహరిరావు తలపడుతున్నారు. ఓటర్లు పైకి జై కొడుతున్నప్పటికీ... చివరి క్షణంలో ఏమి చేస్తారనే అంతర్మథనం.. అభ్యర్థుల్లో గూడుకట్టుకుంటోంది.

ముక్కోణపు పోటీలో నెగ్గేదెవరు..?

వరి, పసుపు, సోయా, పత్తి పంట సాగుతోపాటు గొలుసుకట్టు చెరువులు, కొయ్యబొమ్మలకు నిర్మల్‌ ప్రసిద్ది పొందింది. గల్ఫ్‌, బీడీ కార్మికులూ ఎక్కువే ఉన్నారు. ఒకప్పుడు వందలాది మందికి ఉపాధి చూపించిన నటరాజ్‌ మిల్లు.. కాలగర్భంలో కలిసిపోయింది. అటవీ సంపద, జల వనరులకు(Water Resources) కొదవలేకపోయినప్పటికీ... ప్రగతికి నోచుకోలేదనే ఆవేదన స్థానికుల్లో ఉంది. గత ఎన్నికల్లో వీటి ప్రభావం పెద్దగా కనిపించలేదు. ఇప్పుడు అవే అంశాలు ప్రజల అజెండాగా తెరపైకి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

అధికారమే లక్ష్యంగా ప్రచారాల జోరు- విమర్శలతో రసవత్తరంగా మారుతున్న రాజకీయం

ఎవరినీ ఆశించకుండా నిర్మల్​ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయటానికి ఆలోచించే వ్యక్తులు కావాలి. కానీ బంధు ప్రీతి, బంధువులను.. కులం పేరిటి బలగం చూపే వ్యక్తులను, అణగారిన వారిని ఎదగకుండా చేసే వారు రాజకీయాల్లోకి వస్తున్నారు. కాబట్టి మంచి నాయకుడును ఎన్నుకోవటం చాలా ముఖ్యం. కడుపులో ఆకలి పెట్టుకొని ముఖానికి రంగు పూసుకంటే కడుపు నిండదు కనుక నిర్మల్​ను పారిశ్రామికంగా కానీ.. వ్యవసాయపరంగా అభివృద్ధి చేసే దిశగా తీసుకువెళ్లాలని మేము కోరుకుంటున్నాం.-స్థానికులు

Main Parties Election Campaign in Nirmal : బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీ... నిర్మల్‌ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టిసారించాయి. స్వరాష్ట్రంలో రెండుసార్లు విజయం సాధించిన ఇంద్రకరణ్‌రెడ్డి.. హ్యాట్రిక్‌ విజయం(Hatrick Win) కోసం తపిస్తుంటే.. ఈ దఫానైనా ఎమ్మెల్యేగా గెలవాలనే కసి.. కమలం పార్టీ అభ్యర్థి మహేశ్వర్‌రెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రీహరిరావులో కనిపిస్తోంది. శక్తి, యుక్తులన్నింటినీ క్రోడీకరించి పోరాడుతున్నారు. పార్టీల ఎత్తుగడలతో పల్లె, పట్టణమనే తేడా లేకుండా నిర్మల్‌ రాజకీయం వేడెక్కుతోంది.

దేశం గురించి, ప్రజల గురించి ఈ ప్రాంతీయ పార్టీలు ఆలోచించవు : జేపీ నడ్డా

మాకు పార్టీ అవసరం లేదు. ఎటువంటి రాజకీయాలు అవసరం లేదు కానీ రైతుకు బాసటగా నిలిచే నాయకుడు కావాలి. మేము పసుపు, సోయా, పత్తి పంటలను పండిస్తాం. ఎవరైతే మా పంటకు గిట్టుబాటు ధర.. ఆదుకునే దిశగా కార్యాచరణ ఉంటుందో వారికే పట్టం కడతాం. అన్నదాతల గోడును ఎవరైతే పట్టించుకుంటారో.. వారినే పార్టీలకు అతీతంగా గెలిపించుకుంటాం. -స్థానిక రైతు

కాంగ్రెస్‌ మేనిఫెస్టోను చూసి బీఆర్ఎస్ భయపడుతుంది : రేవంత్​ రెడ్డి

తెలంగాణకు ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్య : కేసీఆర్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.