పీఎన్బీ కుంభకోణం ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ(nirav modi) సోదరి పూర్వి మోదీ బ్యాంకు ఖాతా నుంచి భారత ప్రభుత్వానికి రూ.17.25 కోట్లు బదిలీ అయ్యాయని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) వెల్లడించింది. ఈ కేసులో పూర్వి సహా ఆమె భర్త అప్రూవర్లుగా మారారు. దీంతో వారికి క్రిమినల్ దర్యాప్తు నుంచి మినహాయింపు లభించింది.
నీరవ్ తరఫున లండన్లో తన పేరు మీద ఉన్న ఓ బ్యాంకు ఖాతా గురించి తన దృష్టికి వచ్చినట్లు పూర్వి.. ఈడీకి జూన్ 24న తెలిపారు. అందులో నిధులు తనవి కాదని, వాటిని భారత్ స్వాధీనం చేసుకునేందుకు సహకరిస్తానని ఆమె వారికి వివరించారు. ఈ క్రమంలోనే అవి ప్రభుత్వ ఖాతాకు బదిలీ అయ్యాయి.
న్యూయార్క్, లండన్లలోని రూ.579 కోట్ల విలువైన ఫ్లాట్లు సహా స్విస్ బ్యాంకు డిపాజిట్లను స్వాధీనం చేసుకోవడంలోనూ సహకరిస్తామని పూర్వి హామీ ఇచ్చినట్లు ఈడీ తెలిపింది.
ఇవీ చూడండి: