ETV Bharat / bharat

'మహా'లో 36 వేల 902 కేసులు- 28 నుంచి రాత్రి కర్ఫ్యూ - మార్చి 28 నుంచి మహారాష్ట్రలో రాత్రి కర్ఫ్యూ

మహారాష్ట్రలో రాత్రి కర్ఫ్యూ, night curfew in maharashtra
uddhav thakrey
author img

By

Published : Mar 26, 2021, 8:17 PM IST

Updated : Mar 26, 2021, 9:16 PM IST

20:09 March 26

'మహా'లో 36 వేల 902 కేసులు- 28 నుంచి రాత్రి కర్ఫ్యూ

మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి. శుక్రవారం మరో 36 వేల 902 మంది వైరస్​ బారినపడ్డారు. కరోనా వ్యాప్తి ప్రారంభమైనప్పటినుంచి ఇప్పటివరకు ఒక్కరోజు కేసుల్లో ఇదే అత్యధికం. 

రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 26 లక్షల 37 వేలు దాటింది. 53 వేల 907 మంది ప్రాణాలు కోల్పోయారు. 

రాత్రి కర్ఫ్యూ..

కొవిడ్​ విజృంభణ నేపథ్యంలో ఉద్ధవ్​ సర్కార్​ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా రాత్రి కర్ఫ్యూ అమలు చేయాలని ముఖ్యమంత్రి.. శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. మార్చి 28 నుంచి ఈ ఆంక్షలు అమలు కానున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రాత్రి కర్ఫ్యూ అమల్లో ఉంది.    

కరోనా నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. వైద్య సేవలకు కొరత ఏర్పడుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. వైరస్​ వ్యాప్తి దృష్ట్యా హోలీ పండుగను నిరాడంబరంగా జరుపుకోవాలని స్పష్టం చేసింది.  

ఇదీ చదవండి : నిఖితా తోమర్​ హత్య కేసు దోషులకు జీవితఖైదు

Last Updated : Mar 26, 2021, 9:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.