కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. మహారాష్ట్ర పుణెలో రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాత్రి 11గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫూ ఉంటుందని తెలిపింది. ఇది.. ఆదివారం రాత్రి నుంచే అమల్లోకి వస్తుందని పేర్కొంది.
అదే సమయంలో ఈ నెల 28 వరకు పుణెలో పాఠశాలలు, కళాశాలలు మూసివేయాలని ఆదేశించింది ప్రభుత్వం. ఉన్నతస్థాయి విద్యాసంస్థలు.. 50శాతం ఆక్యుపెన్సీతో నడుపుకోవచ్చని తెలిపింది. అయితే హోటళ్లు, రెస్టారెంట్లు రాత్రి 11 గంటల వరకు మాత్రమే తెరవచ్చని వెల్లడించింది.
దేశవ్యాప్తంగా..
దేశవ్యాప్తంగానూ కేసులు పెరుగుతున్నాయి. భారత్‌లో నమోదవుతున్న మొత్తం కరోనా కేసుల్లో 74శాతం.. కేరళ, మహారాష్ట్రలోనే వెలుగుచూస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లలో కూడా కరోనా కేసులు పెరుగుతున్నట్లు పేర్కొంది. పరీక్షల సామర్థ్యం పెంచాలని, తగిన చర్యలు చేపట్టాలని ఆయా రాష్ట్రాలకు కేంద్రం సూచించింది.
ఇదీ చూడండి: దేశంలో మరో 14,264 మందికి కరోనా